30 ఇయర్స్ పృథ్వీకి ‘దేవుడు’ కనిపించాడు... కనిపించి...

అభిమానులు, తిరుమల శ్రీ వెంకన్న దయతో తాను తొందరగా కోలుకుంటాననే నమ్మకం ఉందని పృథ్వీ తెలిపారు.

‘వెంకటేశ్వరస్వామి ఒకటే అన్నారు. ఒరే నువ్వొక్కడివే కాదురా. కొండమీదకు కోట్లాది మంది భక్తులు వచ్చేవారు. వారు కూడా ఎవరూ రావట్లేదన్నారు.’

  • Share this:
    తనను తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఓదార్చారని 30 ఇయర్స్ పృథ్వీ తెలిపారు. ఎస్వీబీసీ చైర్మన్ పదవిలో ఉండగా, ఉద్యోగితో సరస సంభాషణల ఆడియో బయటకు రావడంతో తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై తాను బాధపడుతుంటే వెంకటేశ్వరస్వామి వచ్చి తనకు ధైర్యం ఇచ్చారని పృథ్వీ చెప్పారు. న్యూస్‌18 తెలుగుకి పృథ్వీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘అది ఎందుకు జరిగిందో ఏమో కానీ, నేను రోజూ బాధపడుతుంటే, ఈ రోజు కొండకి (తిరుమల) కూడా ఎవరూ వెళ్లడానికి లేకుండా పోయింది. నాకు చాలా బాధనిపించింది. వెంకటేశ్వరస్వామి ఒకటే అన్నారు. ఒరే నువ్వొక్కడివే కాదురా. కొండమీదకు కోట్లాది మంది భక్తులు వచ్చేవారు. వారు కూడా ఎవరూ రావట్లేదన్నారు. కాబట్టి నువ్వు దిగులుపడకు అన్నారు. అయితే, మీకు స్వామి చెప్పారా? అంటారు. స్వామి నడిచొచ్చి చెప్పారని చాలా మంది చెబుతూ ఉంటారు. నేను ఒకటే చెబుతా. నేను కూర్చుని ఆలోచిస్తుంటే, ఒక ఉలిక్కిపడ్డట్టు లేచా. అప్పుడు వెంకటేశ్వరస్వామి.. ఇది నీకు వచ్చిన గ్యాప్. ఇది నీకు శిక్ష కాదు. మానసికంగా అధైర్యపడకు. నువ్వు అలా అనుకోవద్దు. నీ చుట్టూ ఏర్పడిన కరోనా వైరస్‌ వెధవలను గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా ఉండు.’ అని తిరుమల వేంకటేశ్వరస్వామి చెప్పినట్టు పృథ్వీ తెలిపారు. తన వెనుక జరిగిన కుట్రలు అన్నిటినీ ఆ వెంకటేశ్వరస్వామి బయటపెడతారని చెప్పారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: