ఎద్దును తప్పించబోయి లారీనీ ఢీకొట్టారు.. అనంతపురంలో ముగ్గురు మృతి

తాడిపత్రి పట్టణ సమీపంలో గరుడ స్టీల్ ప్లాంట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

news18-telugu
Updated: September 15, 2020, 8:48 AM IST
ఎద్దును తప్పించబోయి లారీనీ ఢీకొట్టారు.. అనంతపురంలో ముగ్గురు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎద్దును తప్పించబోయి ఓ తుఫాన్ వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తాడిపత్రి పట్టణ సమీపంలో గరుడ స్టీల్ ప్లాంట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారు తాడిపత్రి మెయిన్ బజార్‌కు చెందిన వారుగా గుర్తించారు. తిరుపతి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Published by: Shiva Kumar Addula
First published: September 15, 2020, 8:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading