హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News: అర్ధరాత్రి కారు ఆపి రూ.3కోట్ల దోపిడీ.. పక్కా స్కెచ్ తో పనికానిచ్చారు..

AP News: అర్ధరాత్రి కారు ఆపి రూ.3కోట్ల దోపిడీ.. పక్కా స్కెచ్ తో పనికానిచ్చారు..

ప్రకాశం జిల్లాలో భారీ దోపిడీ

ప్రకాశం జిల్లాలో భారీ దోపిడీ

Ongole News: బాధితులు పొంతనలేని సమాధానం చెప్పడడంతో ఇది హవాలా డబ్బేనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? ఎందుకు తీసుకెళ్తున్నారు..? అది వారి సొంత డబ్బేనా లేక వ్యాపార నిమిత్తం తీసుకెళ్తున్నారా..?

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా (Prakasham District) దోర్నాలలో భారీ దొపిడీ జరిగింది. కారును అటకాయించిన దుండగులు ఏకంగా మూడు కోట్ల రూపాయలు దోచుకెళ్లారు. గుజరాత్ కు చెందిన కాలురామ్, అరవింద్ అనే వ్యక్తులు కోల్ కతా నుంచి కర్ణాటకలోని హోస్ పేటకు డబ్బులతో బయలుదేరారు. సోమవారం అర్ధరాత్రి ప్రకాశం జిల్లాలోని దోర్నాల సమీపంలో యడ్లవల్లి అటవీ ప్రాంతానికి చేరుకున్న తర్వాత అప్పటికే వారిని కారులో ఫాలో అవుతున్న దుదుండగులు వారి కారును అడ్డగించారు. తర్వాత బలిజేపల్లి రోడ్డులోకి కారును మళ్లించి అటవీ ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత కత్తులతో బెదిరింది వారి దగ్గరున్న రూ.3 కోట్లను ఎత్తుకెళ్లారు. అనంతరం వారి కారు తాళాలు లాక్కొని పొదల్లో పారేశారు. చిమ్మచీకటి కావడంతో కాలినడకన మెయిన్ రోడ్డుకు చేరుకున్న బాధితులు అటుగా వచ్చిన అటవీ సిబ్బందికి జరిగిన విషయాన్ని చెప్పారు.

  మంగళవాం ఉదయం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. క్లూజ్ టీమ్ రంగంలోకి దిగి కారుపై ఉన్న వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. ఐతే బాధితులు పొంతనలేని సమాధానం చెప్పడడంతో ఇది హవాలా డబ్బేనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? ఎందుకు తీసుకెళ్తున్నారు..? అది వారి సొంత డబ్బేనా లేక వ్యాపార నిమిత్తం తీసుకెళ్తున్నారా..? అనే విషయాలను పోలీసులు కూపీ లాగుతున్నారు.

  ఇది చదవండి: ప్రియుడితో వెళ్లిపోయిన తల్లి.. రైలు పట్టాలపై పడుకున్న తండ్రి.. చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్..


  ఐతే దుండగులు వారి కారును ఫాలో అయి అటవీ ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత అటాకాయించి దోపిడీ చేశారంటే ఇది కచ్చితంగా తెలిసిన వారి పనేనని పోలీసులు భావిస్తున్నారు. ఇది నిజంగా హవాలా డబ్బయితే ఆ ముఠాలోని వారే చేసుంటారని.. వ్యాపారనిమిత్తం తీసుకెళ్తే శత్రువులెవరైనా అలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

  ఇది చదవండి: భర్తకంటే వాడే ఎక్కువనుకున్నావ్.. కానీ వాడు నిన్నే లేకుండా చేశాడు కదమ్మా..!


  ఇదిలా ఉంటే మంగళవారం అనకాపల్లి జిల్లాలోని ఓ వాహనంలో డబ్బులు కలకలం రేపాయి. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసుసలు ఓ వాహనంలో దాదాపు రూ.3కోట్లు స్వాధీనం చేసుకున్నారు. కోనసీమ జిల్లాకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి విశాఖ నుంచి డబ్బులు తీసుకొస్తుండగా.. పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కారుఆపి అందులోని బ్యాంగ్ ను తనిఖీ చేయగా రూ.3కోట్ల నగదు పట్టుబడింది. డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసి ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇటీవల ఏపీలోని పలుచోట్ల నిర్వహించిన తనిఖీల్లో కోట్లాది రూపాయల నగదు పట్టుబడింది. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా భారీగా నగదును తీసుకెళ్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Prakasham dist, Robbery

  ఉత్తమ కథలు