2018-19 నుండి గత మూడేళ్లలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ (పిఎంఎవై-యు) కింద మురికివాడల కోసం మొత్తం3,88,309 అఫర్డబుల్ ఇళ్ల నిర్మాణాలు ఆంధ్రప్రదేశ్ లో జరిగాయని రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నాత్వానీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 2021 జూలై 28 న రాజ్యసభలో గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కౌషల్ కిషోర్ ఈ సమాచారాన్ని అందించారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ. 6,807.72 కోట్లు రాష్ట్రంలో మురికివాడలోని ఇళ్ల నిర్మించినట్లు కేంద్రమంత్రి తన సమాధానంలో పేర్కొనడం విశేషం.
ఇదిలా ఉంటే జనాభా లెక్కల ప్రకారం దేశంలోని మురికివాడల సంఖ్య 33,510 కాగా వాటిలో నివసించే వారి జనాభా 6,54,94,604గా ఉంది. ఇక జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్ఓ) 69 వ రౌండర్ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 4,539 మురికివాడలు ఉన్నాయి. ఈ మురికివాడల్లో జనాభా 1,01,86,934 గా ఉంది.
దేశంలోని మురికివాడలలో నివసించే వారి కోసం అఫర్డబుల్ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గృహాల సంఖ్య గురించి రాజ్యసభ సభ్యుడు పరిమల్ నాత్వానీ రాజ్యసభలో ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం కేంద్ర సహాయం వివిధ రాష్ట్రాలకు గత మూడేళ్లలో రూ 71,445.79 కోట్ల ఖర్చుతో మొత్తం 41,13,844 ఇళ్లు నిర్మించామని మంత్రి ప్రకటనలో తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Parimal Nathwani