అమెరికాలో సరస్సులో పడి తెలుగు విద్యార్థి మృతి

సుమీద్ ప్రమాదవశాత్తు సరస్సులో పడిపోయాడా? లేదంటే కావాలనే దూకాడా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

news18-telugu
Updated: August 21, 2019, 5:07 PM IST
అమెరికాలో సరస్సులో పడి తెలుగు విద్యార్థి మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమెరికాలో తెలుగు విద్యార్థి మరణించాడు. విశాఖపట్టణానికి చెందిన సుమీద్ (27) ప్రమాదవశాత్తు సరస్సులో పడి మరణించాడు. ఓరెగాన్‌లోని క్రాటర్ సరస్సులో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సీతమ్మధార ప్రాంతానికి చెందిన ఎ.ఎస్.కుమార్ విశాఖ స్టీల్‌ప్లాంట్ క్రీడలశాఖ డీజీఎంగా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు సుమీద్ యూఎస్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో ఎంఎస్ రోబొటిక్స్ చదువుతున్నాడు. ఆదివారం మరో ఇద్దరు భారతీయ మిత్రులతో కలిసి సరస్సును చూసేందుకు వెళ్లారు. జంపింగ్ రాక్ నుంచి అతడు చెరువులో పడడంతో నీట మునిగి చనిపోయాడు. 25 మీటర్ల ఎత్తు నుంచి సుమీద్ పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఐతే ప్రమాదవశాత్తు పడిపోయాడా? లేదంటే కావాలనే దూకాడా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమీద్ మృతితో సీతమ్మధారలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>