Home /News /andhra-pradesh /

259 PRISONERS RELEASED DUE TO CORONA EFFECT IN ANDHRA PRADESH BN

కరోనా ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో 259 మంది ఖైదీలు విడుదల

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ జైళ్లశాఖ 259 మందిని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మీద ఖైదీలను విడుదల చేస్తున్నారు. నెల రోజుల తర్వాత ఖైదీలు జైళ్లకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.

    కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా వణికిపోతోంది. కానీ కొంతమందికి మాత్రం కరోనా వైరస్ కాస్తంత ఉపశమనాన్ని కలిగిస్తోంది. అదేంటి.. అనుకుంటున్నారా.. జైళ్లలోని ఖైదీలపై కరోనా వైరస్ ఎఫెక్ట్ పడకుండా జైళ్ల శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ మధ్యంతర బెయిల్‌పై 259 మంది ఖైదీలను విడుదల చేసింది. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ మహ్మద్ హసన్ రేజా అన్ని జైళ్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జైళ్లలో నుంచి విడుదలైన ఖైదీలంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ లేదా సొంత ఇంటిలో నిర్బంధంలో ఉండాలి. నెలరోజుల అనంతరం తిరిగి జైలుకు వెళ్లాలి.

    ఇదిలావుంటే.. రాష్ర్టంలోని 81 జైళ్లలో ప్రస్తుతం 6930 మంది ఖైదీలు ఉండగా, వారందరికీ కరోనా సోకకుండా సామాజిక దూరం పాటించేలా ఏర్పాటు చేశారు. దీంతో పాటు భోజన సమయంలో పదిమంది ఖైదీల చొప్పున అనుమతించడం, బ్యారక్‌లలో తక్కువ మందిని ఉంచడం వంటి చర్యలను తీసుకుంటున్నారు. ఇకపోతే ఖైదీలను అవసరమైన మాస్కులను విశాఖపట్నం, నెల్లూరు, రాజమమహేంద్రవరం, కడప కేంద్ర కారాగారాలతో పాటు విజయవాడ, ఒంగోలు జిల్లా జైళ్లలోనూ మాస్కులు తయారుచేస్తున్నారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Andhra Pradesh, Corona virus, Jail, Rajamundry central jail

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు