హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

రికార్డు స్థాయిలో శ్రీవారి సబ్సిడీ లడ్డూల అమ్మకం

రికార్డు స్థాయిలో శ్రీవారి సబ్సిడీ లడ్డూల అమ్మకం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రూ.50 లడ్డూను టీటీడీ సబ్సిడీ కింద భక్తులకు రూ.25కే అందజేస్తున్న విషయం తెలిసిందే.

తిరుమల శ్రీవారి లడ్డూలకు ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి నిరూపితమైంది. సిబ్బడిడీపై శ్రీవారి లడ్డూలను అమ్మకానికి పెట్టిన తొలిరోజే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. కేవలం మూడు గంటల్లోనే లడ్డూలన్నీ అమ్ముడపోయాయి. సోమవారం ఒక్కరోజే 2.4 లక్షల సబ్సిడీ లడ్డూలను అమ్మినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి సబ్సిడీ లడ్డూలను ఏపీలోని 12 జిల్లా కేంద్రాల్లో అమ్ముతున్నారు.

జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కల్యాణమండపాలు, సమాచార కేంద్రాల్లో వీటిని అమ్మకానికి ఉంచారు. ఐతే గుంటూరులో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందన అక్కడ శ్రీవారి లడ్డూలను విక్రయించడం లేదు. గుంటూరుకు కేటాయించిన లడ్డూలను విజయవాడకు తరలించి అమ్మకానికి ఉంచారు. గంటూరులో మే 30 నుంచి శ్రీవారి లడ్డూల అమ్మకాలను ప్రారంభిస్తారు.

మంగళవారం మరో 2 లక్షల లడ్డూలు జిల్లా కేంద్రాలకు తరలించనున్నట్లు అధికారుతు తెలిపారు. లడ్డూల కోసం తెలంగాణ, తమిళనాడు భక్తుల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడుకు లక్ష, తెలంగాణకు 50 వేల లడ్డూలు పంపాలన్న యోచనలో టీటీడీ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ వల్ల తిరుమలలో 60 రోజులుగా దర్శనాలు లేకపోవడం, శ్రీవారి ప్రసాదం అందుబాటులో లేకపోవడంతో చాలా మంది భక్తులు ఈ లడ్డూల కోసం పోటీపడ్డారు. కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రూ.50 లడ్డూను టీటీడీ సబ్సిడీ కింద భక్తులకు రూ.25కే అందజేస్తున్న విషయం తెలిసిందే.

First published:

Tags: AP News, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam

ఉత్తమ కథలు