21,000 మంది సిబ్బంది... మే 23న భారీ భద్రత మధ్య ఏపీ ఎన్నికల లెక్కింపు...

ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది (ఫైల్ ఫోటో)

AP Election Counting 2019 : ఓట్ల లెక్కింపునకు ఈసారి 21 వేల మంది సిబ్బంది సేవల్ని ఉపయోగించుకోబోతోంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం.

  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో... సరైన భద్రతా ఏర్పాట్లు చెయ్యలేదనీ, కొన్ని చోట్ల హింస చెలరేగడానికి ఎన్నికల సంఘం పర్యవేక్షణా లోపమే కారణమని విమర్శలు రావడంతో... రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ ఈసారి మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మే 23న జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 21,000 మంది సిబ్బంది సేవల్ని ఉపయోగించుకోబోతున్నట్లు తెలిపారు. ఎవరు ఎక్కడ ఓట్ల లెక్కింపులో పాల్గొంటారో చివరి నిమిషం వరకూ తెలియకుండా జాగ్రత్త పడుతున్నట్లు వివరించారు. తద్వారా ఎలాంటి అక్రమాలకూ అవకాశం లేకుండా చేస్తున్నామంటున్నారు ద్వివేది.

ఓట్ల లెక్కింపు సమయంలో కచ్చితంగా అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని ఇటు టీడీపీ, అటు వైసీపీ ఆరోపిస్తున్నాయి. అందువల్ల ఆ పరిస్థితి రాకుండా... సిబ్బందిని ఎంపిక చేశాక, రెండు సార్లు ర్యాండమైజేషన్ చేస్తామన్నారు ద్వివేది.

ద్వివేది చెప్పిన కీలక అంశాలు :
* అసెంబ్లీ, లోక్ సభ స్థానాల పరిధిలో ఐదేసి పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కిస్తారు.
* మే 23న ఉదయం ముందుగా పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ఉంటుంది.
* లెక్కింపు ప్రారంభమయ్యే ముందు చివరి నిమిషం వరకూ పోస్టల్, సర్వీస్ ఓటర్లు తమ ఓటును ఉపయోగించుకోవచ్చు.
* ఓకే పేరుతో రెండు పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చే అవకాశం లేదు. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు.
* ఓట్ల లెక్కింపునకు 15 టేబుళ్ల చొప్పున ఏర్పాటు
* ఒక్కో టేబుల్‌కూ కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు సహా మైక్రో అబ్జర్వర్‌ నియామకం.

ఏపీ ఎన్నికలకు రూ.550-600 కోట్లు ఖర్చయినట్లు ద్వివేది తెలిపారు. ఏపీలో ఏప్రిల్ 11న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. 25 పార్లమెంటరీ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏపీ అసెంబ్లీకి మొత్తం 2,118 మంది పోటీ చేయగా.. లోక్‌సభకు 319 మంది పోటీపడ్డారు. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తంచేస్తున్నారు. విజయం తమదేనని ఇటు టీడీపీ, అటు వైసీపీ ఢంకా బజాయిస్తున్నాయి. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా... అధికారం ఎవరిని వరిస్తుందన్నది మే 23న తేలనుంది.

 

ఇవి కూడా చదవండి :

ముస్లింలు ఉగ్రవాదులు కాదు... వారిని అలా చూడొద్దని కోరిన శ్రీలంక అధ్యక్షుడు...

తాగి వస్తున్న భర్తకు తిండి పెట్టడం మానేసింది... అతను ఏం చేశాడంటే...

శ్రీలంకలో చనిపోయింది 253 మందే... లెక్క తప్పిందన్న శ్రీలంక ప్రభుత్వం...

జగన్ స్విట్జర్లాండ్‌కూ... చంద్రబాబు సిమ్లాకు... సమ్మర్‌లో రిలాక్స్...
First published: