ప్రకాశం జిల్లాలో పెద్దపులి మృతి

ప్రకాశం జిల్లాలో పెద్దపులి మృతి చెందింది. ముసలితనం వల్ల చనిపోయిందని వైద్యులు తెలిపారు.

news18-telugu
Updated: May 23, 2020, 8:01 PM IST
ప్రకాశం జిల్లాలో పెద్దపులి మృతి
ప్రకాశం జిల్లాలో చనిపోయిన పులి
  • Share this:
ప్రకాశం జిల్లాలో పెద్దపులి మృతి చెందింది. ముసలితనం వల్ల చనిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం చెన్నుపల్లి చెంచు గూడెం సమీపంలో ఈ ఘటన జరిగింది.నల్లమల అడవి ప్రాంతంలో పెద్ద పులి మృతి చెందినట్టు గుర్తించారు. ఈ విషయం స్థానికులు అధికారులకు తెలియజేశారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు అక్కడ పరిశీలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం వెటర్నరీ డాక్టర్ ఆ పులికి పంచనామా నిర్వహించారు. ఈ పెద్దపులి వయసు 20 సంవత్సరాలు ఉంటుందని, ముసలితనంతో చనిపోయిందని DFO షేక్ ఖాదర్ బాషా తెలిపారు.

First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading