హోటల్‌లో బిర్యానీ తిన్న 20 మందికి అస్వస్థత.. అసలు ఏమైందంటే..

ప్రతీకాత్మక చిత్రం

సరదాగా హోటల్‌కు వెళ్లి బిర్యానీ తిన్న ఓ కుటుంబం అస్వస్థతకు గురయ్యారు. వారు మాత్రమే ఆ హోటల్‌లో ఫుడ్ తిన్న మొత్తం 20 అస్వస్థతకు లోనైనట్టుగా తేలింది.

 • Share this:
  సరదాగా హోటల్‌కు వెళ్లి బిర్యానీ తిన్న ఓ కుటుంబం అస్వస్థతకు గురయ్యారు. వారు మాత్రమే ఆ హోటల్‌లో ఫుడ్ తిన్న మొత్తం 20 అస్వస్థతకు లోనైనట్టుగా తేలింది. ఒంగోలు నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. స్థానికంగా ఉండే ఖాదర్ షా వలీ కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు ఆదివారం సాయంత్రం సరదాగా గడిపేందకు బయటకు వచ్చారు. రాత్రి నగరంలోని కర్నూలు రోడ్డులో ఉంటే ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడ బిర్యానీ ఆర్డర్ చేశారు. ఫిష్, చికెన్, మటన్ బిర్యానీ తిన్నారు. అనంతరం హోటల్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లారు. అయితే ఉన్నట్టుండి రాత్రి 2 గంటల సమయంలో ఖాదర్ షా వలీ కుటుంబసభ్యులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. ఒక్కసారిగా ఇలా జరగడంతో వారు కంగారు పడిపోయారు. వెంటనే సమీపంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు.

  అయితే తాము ఇలా అస్వస్థతకు గురికావడానికి ఫుడ్ పాయిజన్ కారణం అయి ఉండొచ్చని ఖాదర్ షా కుటుంబం భావించింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో లక్ష్మీనారాయణ తన సిబ్బందితో సోమవారం హోటల్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. వంట గది, వండిని ఆహార పదార్థాలను పరిశీలించారు. అనుమానస్పదంగా అనిపించిన ఆహార నమునాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబోరేటరీకి పంపించారు. అయితే అదే సమయంలో ఖాదర్ షా వలీ కుటుంబంతో పాటుగా ఆ హోటల్‌లో భోజనం చేసిన మరికొంత మంది కూడా అస్వస్థతకు గురైనట్టుగా అధికారులకు తెలిసింది.

  మొత్తంగా ఆ హోటల్‌లో భోజనం చేశాక మొత్తం 20 మంది వరకు ఆస్పత్రి పాలైనట్టుగా సమాచారం అందిందని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఆహార నమునాల ల్యాబ్ రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆహారం విక్రయించే వారు నాణ్యమైన ప్రమాణాలు పాటించాలన్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: