హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Shocking: సాంబార్ గిన్నెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి.. బర్త్ డే వేడుకలో విషాదం.. కృష్ణా జిల్లాలో ఘటన..

Shocking: సాంబార్ గిన్నెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి.. బర్త్ డే వేడుకలో విషాదం.. కృష్ణా జిల్లాలో ఘటన..

ఘటనకు ముందు చిన్నారి తేజశ్విని

ఘటనకు ముందు చిన్నారి తేజశ్విని

అప్పటి దాకా తన ముద్దు ముద్దు మాటలతో ఇంట్లోవాళ్లకు సంతోషాన్ని పంచిన రెండేళ్ల చిన్నారి.. పొరపాటున వేడివేడి సాంబార్ గిన్నెలో పడి ప్రాణాలు కోల్పోయింది. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలో జరిగిందీ ఘటన..

కృష్ణా జిల్లాలో మాటలకందని విషాదం చోటు చేసుకుంది. ముద్దు ముద్దు మాటలతో ఇంట్లోవాళ్లకు సంతోషాన్ని పంచిన చిన్నారి.. అంతలోనే అందరినీ విషాదంలో ముంచింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. తల్లి చేతి గోరుముద్దలు తింటూ సరదాగా ఆడుకుంటూ పొరపాటున సాంబర్ గిన్నెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. బంధువుల ఇంటి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం తీవ్రవిషాదాన్ని మిగిల్చింది. ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలివి..

కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలోని కలగర ఎస్సీ వాడకు చెందిన కారుమంచి శివ, బన్ను దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో తేజశ్విని(2) గత ఏడాది కాలంగా సత్తుపల్లిలోని అమ్మమ్మ వద్ద ఉంటోంది. శివ సోదరుడు రవికి ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్దకుమార్తె పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. శివ ఊరెళ్లి తేజశ్వినిని కూడా తీసుకొచ్చాడు. రోజంతా తన అమ్మానాన్నలతో పాటు, అక్కలు, పెద్దమ్మ, పెదనాన్న, నానమ్మ, తాతలతో కలసి తీయని అనుభూతులు పంచుకుంది. వచ్చీరాని మాటలతో సందడి చేసింది. కాగా,

Zaheerabad: ప్రేమికుల రోజు ఏకాంతమంటూ దారుణం.. దిండ్లు పేర్చి నిద్రపోతున్నట్లు నమ్మించి!!


ఈ క్రమంలో ఆదివారం రాత్రి తల్లి బన్ను చేతిలో గోరుముద్దలు తింటూ ఆటలాడుకుంటున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో పిల్లలందరికీ కలిపి అన్నం తినిపిస్తున్న తల్లి.. ఒక్క క్షణం పక్కకు వెళ్లొచ్చేలోపే విషాదం జరిగింది. ఆటలాడుకుంటున్న తేజశ్విని.. అప్పుడే కాచిన వేడి సాంబారు గిన్నె వద్ద సంచరిస్తూ వచ్చీ రాని నడకతో తూలిపడింది. సాంబార్ గిన్నెపై సగం తెరిచిన మూతపై చేతులు పెట్టగానే కాలి.. పట్టుజారి గిన్నెలో పడిపోయింది.

చిన్నారి తేజశ్విని

Surgical strike ఆధారాలివిగో : ఆర్మీని బద్నాం చేసిన CM KCR: అస్సాం సీఎం దిమ్మతిరిగే కౌంటర్ Video


వేడి సాంబార్ లో పాప పడిపోయినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు తేజస్వినిని హుటాహుటిన బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. తొలుత తిరువూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం పాపను విజయవాడలోని పెద్దాసుపత్రికి తరలించబోయారు. కానీ దారి మధ్యలోనే తేజస్విని ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

First published:

Tags: Andhra pradesh news, Krishna District

ఉత్తమ కథలు