శ్రీశైలం ఘాట్ రోడ్‌లో ఆర్టీసీ బస్సులు ఢీ.. ఇద్దరు మృతి

ఘాట్ రోడ్డులో ఓ మలుపు వద్ద రాజమండ్రి, ధర్మవరం డిపోలకు చెందిన బస్సులు ఢీకొన్నాయి. ఘటనలో ధర్మవరం డిపో బస్సులో ఉన్న ఇద్దరు మహిళలు చనిపోయారు.

news18-telugu
Updated: December 4, 2019, 8:04 PM IST
శ్రీశైలం ఘాట్ రోడ్‌లో ఆర్టీసీ బస్సులు ఢీ.. ఇద్దరు మృతి
శ్రీశైలంలో రోడ్డు ప్రమాదం
  • Share this:
కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురికి గాయాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీశైలం బస్టాండ్‌కు 15 కి.మీ. దూరంలో ఈ ఘటన జరిగింది. ఘాట్ రోడ్డులో ఓ మలుపు వద్ద రాజమండ్రి, ధర్మవరం డిపోలకు చెందిన బస్సులు ఢీకొన్నాయి. ఘటనలో ధర్మవరం డిపో బస్సులో ఉన్న ఇద్దరు మహిళలు చనిపోయారు.  వారి మృతదేహాలు చెల్లాచెదురై గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం.
First published: December 4, 2019, 6:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading