యానాంలో విషాదం.. నదిలో ఇద్దరు యువకుల గల్లంతు

గల్లంతైన యువకులను కొప్పల శేషసాయి పవన్ (19), నేకురి చంద్రహాసన్‌(20)గా గుర్తించారు. వారి కోసం నదిలో గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

news18-telugu
Updated: November 18, 2019, 9:30 PM IST
యానాంలో విషాదం.. నదిలో ఇద్దరు యువకుల గల్లంతు
నదిలో గల్లంతైన యువకులు
  • Share this:
యానాంలో విషాదం నెలకొంది. గౌతమి గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. రాజమండ్రికి చెందిన 10 మంది యువకులు యానాం టూర్‌కు వెళ్లారు. ఐతే ముగ్గురు యువకులు నదిలో స్నానానికి వెళ్లగా.. వారిలో ఇద్దరు కొట్టుకుపోయారు. గల్లంతైన యువకులను కొప్పల శేషసాయి పవన్ (19), నేకురి చంద్రహాసన్‌(20)గా గుర్తించారు. వారి కోసం నదిలో గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. యువకులు గల్లంతవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఇద్దరూ క్షేమంగా రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.


First published: November 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...