విశాఖ మన్యంలో మళ్లీ కాల్పుల మోత.. ఇద్దరు మావోయిస్టులు మృతి

మావోయిస్టుల కదలికలపై నిఘాపెట్టామని.. ఏవోబీలో కూంబింగ్ కొనసాగుతోందని డీజీపీ సవాంగ్ తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు.

news18-telugu
Updated: September 23, 2019, 10:50 PM IST
విశాఖ మన్యంలో మళ్లీ కాల్పుల మోత.. ఇద్దరు మావోయిస్టులు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విశాఖ ఏజెన్సీ మళ్లీ కాల్పులతో దద్ధరిల్లింది. ఏవోబీలో సోమవారం మరోసారి ఎన్‌కౌంటర్‌ జరిగింది. తీగలబండ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో ఏకే 47 సహా పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కదలికలపై నిఘాపెట్టామని.. ఏవోబీలో కూంబింగ్ కొనసాగుతోందని డీజీపీ సవాంగ్ తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. కాగా, ఆదివారం కూడా విశాఖ ఏజెన్సీలో ఎదురు కాల్పులు జరిగాయి. నిన్న ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. మృతులను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అజయ్, బుద్రి, బిమలగా గుర్తించారు. ఈ రెండు రోజుల్లో ఏపీలో మొత్తం ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు.





First published: September 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...