Home /News /andhra-pradesh /

2 ANDHRA PRADESH PILGRIMS NOT FOUND TILL IN AMARNATH YATRA REAMING ALL SAFE NGS

Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రలో ఏపీ నుంచి ఇద్దరు గల్లంతు.. మిగిలిన వారు సురక్షితం అంటున్న అధికారులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Amarnath Yatra: పెను విషాదం నింపింది అమర్ నాథ్ యాత్ర. అయితే ప్రస్తుతం ఇద్దరి ఆచూకీ మాత్రమే గల్లంతైందని.. మిగిలిన వారు క్షేమంగానే ఉన్నారంటున్నారు అధికారులు.. మరోవైపు ఏదైనా సమాచారం కోసం హెల్ప్ లైన్లను సంప్రదించొచ్చని అధికారులు కోరుతున్నారు.

ఇంకా చదవండి ...
    Amarnath Yatra: అమర్‌నాథ్‌ (Amarnath) లో వరద బీభత్సం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విషాదం నింపింది. జమ్మూ కశ్మీర్‌లోని (Jammu and Kashmir) అమర్‌నాథ్‌ లో మూడు రోజుల క్రితం భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మంచు లింగం రూపంలో భక్తులతో పూజలను అందుకుంటున్న పవిత్ర గుహ సమీపంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తింది. ఆ వరదల్లో చిక్కుకుని పలువురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో యాత్రికులు గల్లంతయ్యారని ఎన్డీఆర్ ఎఫ్ బృందం పేర్కొంది. గల్లంతైన వారికోసం సహాయ చర్యలు కొనసాగుతోంది. ఇలా గల్లంతైన ప్రయాణికుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తులు ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)లో విషాదం నెలకొంది. అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని రాజమహేంద్రవరంకు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. వరదల కారణంగా గల్లంతైన సుధ, పార్వతి అనే మహిళల మృతదేహాలను సహాయక బృందాలు సోమవారం గుర్తించాయి. ఇప్పటి వరకు వరదల కారణంగా మృతి చెందినవారి సంఖ్య 18కి చేరుకుంది.

    నెల్లూరు జిల్లా నుంచి మొత్తం 82 మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారని కలెక్టర్‌ చక్రధర్ బాబు తెలిపారు. వీరిలో ఇప్పటి వరకు 57 మంది సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. మిగిలిన వారు క్షేమంగానే ఉన్నట్టు తెలుస్తోంది అన్నారు. ఇంకా ఆచూకీ దొరకనివారి కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని కలెక్టర్ ధైర్యం చెప్పారు. అలాగే నెల్లూరు జిల్లా యాత్రికుల కోసం 1902 టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.



    ఇప్పటికే ప్రాణాలతో బయటపడిన నెల్లూరు జిల్లా యాత్రికులు బంధువులకు ఫోన్‌ చేసి క్షేమ సమాచారం ఇస్తున్నారు. వారివారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన.. పలువురు తెలుగు యాత్రికుల క్షేమ సమాచారాలు అందకపోవడంతో.. రెవెన్యూ అధికారులు వారి చిరునామాలు, ఫోన్‌ నంబర్ల ఆధారంగా ఇళ్లకు వెళ్లి విచారిస్తున్నారు. ఈ సందర్భంగా.. కొందరు తమ బంధువులు క్షేమంగానే ఉన్నారని చెప్పగా.. మరికొందరు తమవారి జాడ తెలియట్లేదని చెబుతున్నారు. ఈ వివరాలు సేకరిస్తున్న అధికారులు.. జాడ తెలియని వారి వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు.

    ఇదీ చదండి : జనసేన పవన్ ఆరోపణలపై ప్రభుత్వం క్లారిటీ.. వైసీపీ ఎంపీటీసీ భూ కబ్జా ఆరోపణలపై ఏమన్నారంటే..?

    ఇటు తూర్పుగోదావరి జిల్లా నుంచి అమర్నాథ్ యాత్రకు 20 మంది భక్తులు వెళ్లారని.. వీరిలో ఇద్దరు యాత్రికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని కలెక్టర్ మాధవీలత ప్రకటించారు. అయితే ఆ గల్లంతైన ఇద్దరు భక్తులు మహిళలని.. ఇద్దరూ రాజమండ్రికి చెందిన మహిళలే అని చెప్పారు. గల్లంతైన వారు రాజమండ్రి అన్నపూర్ణమ్మపేట కు చెందిన కొత్త పార్వతి, కుమారీ టాకీస్ ఏరియాకు చెందిన మునిశెట్టి సుధలు గా గుర్తించినట్లు పేర్కొన్నారు.

    ఇదీ చదండి : సీఎం జగన్‌ విశాఖ పర్యటన.. వారి ఖాతాలోకి నగదు.. అర్హులు ఎవరంటే?

    ఆయితే తమ కళ్ళ ఎదుటే వరద ఉధృతికి ఓ వృద్ధురాలు కొట్టుకుపోయిందని తోటి యాత్రికులు, కుటుంబ సభ్యులు చెప్పారు. ఇంకా ఎవరికైనా ఎలాంటి సాయం కావాలన్నా ఏపీ అధికారులు అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. అలాగే స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవడానికి .. AP యాత్రికుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం AP భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్‌ను శ్రీనగర్‌కు పంపింది. ఆయన ఎప్పటికప్పుడు యాత్రీకుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Amarnath Yatra, Amarnath Yatra 2022, Andhra Pradesh, AP News, East Godavari Dist, Nellore Dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు