Special Trains: ఆ ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక రైళ్లు..

Special Trains: ఆ ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక రైళ్లు..

దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు శభవార్త చెప్పింది. ఆది, సోమవారాల్లో నర్సాపూర్ టూ హైదరాబాద్, హైదరాబాద్ టూ విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.

  • Share this:
    ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆది, సోమవారాల్లో దక్షిణ మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. నర్సాపూర్ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్యలో ఈ రైళ్లను నడపనున్నారు. నర్సాపూర్ నుంచి హైదరాబాద్‌కు గుంటూరు మీదుగా ఫిబ్రవరి 9, 16, 23, మార్చి 1, 8, 15, 22, 29 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. నర్సాపూర్ టూ హైదరాబాద్ రైలు నర్సాపూర్‌లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు ఉదయం 4.30 గంటలకు చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు గుంటూరు మీదుగా వెళ్లే ఫిబ్రవరి 10, 17, 24, మార్చి 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి 23.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 06.30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.

    నర్సాపూర్ టూ హైదరాబాద్ రైలు ఆగే స్టేషన్లు..

    పాలకొల్లు, విరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ, సికింద్రాబాద్.

    హైదరాబాద్ టూ విజయవాడ రైలు ఆగే స్టేషన్లు..

    సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
    Published by:Vijay Bhaskar Harijana
    First published: