గుంటూరు జిల్లాలో ఘోరం.. పిడుగు పడి 150 గొర్రెలు మృతి

ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. బాపట్ల మండలం వెదుళ్లపల్లె రైల్వే ట్రాక్ సమీపంలో పిడుగు పడి 150 గొర్రెలు మృత్యువాతపడ్డాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 9, 2019, 12:01 PM IST
గుంటూరు జిల్లాలో ఘోరం.. పిడుగు పడి 150 గొర్రెలు మృతి
పిడుగు పడి 150 గొర్రెలు మృతి
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 9, 2019, 12:01 PM IST
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. బాపట్ల మండలం వెదుళ్లపల్లె రైల్వే ట్రాక్ సమీపంలో పిడుగు పడి 150 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఈ రోజు ఉదయం భారీ వర్షం, ఉరుములు మెరుపులతో పిడుగులు పడటంతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. ఒక్కసారిగా పిడుగు గొర్రెలపై పడటంతో మూగ జీవాలు ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు విడిచాయి. వీటి విలువ రూ.7 లక్షల వరకు ఉంటుందని సమాచారం. కాగా, వందల సంఖ్యలో గొర్రెలు చనిపోవడంతో గొర్రెల కాపర్లు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ గొర్రెలు మద్దిబోయినపాలెంకు చెందిన వీరయ్య, ముసలయ్య, బాజీ, శేషయ్యలకు చెందినవిగా గుర్తించారు. గొర్రెలు చనిపోయిన ఘటనపై బాధితుడు మాట్లాడుతూ.. తమ జీవాధారం గొర్రెలేనని, వాటిని పెంచి పోషించి.. వాటినే అమ్ముకొని జీవిస్తున్నామని, కూడబెట్టిన ఆస్తులు కూడా ఏమీ లేవని తమ గోడు వెల్లబోసుకున్నాడు.

గొర్రెలను కాస్తూ పిల్లల్ని చదివించుకుంటున్నామని, నోటికాడికి ఇంత ముద్ద వస్తుందంటే వాటివల్లేనని.. అవే ఇప్పుడు మృత్యువాతపడ్డాయని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. రెండు చేతులు జోడించి వేడుకుంటున్నామని, తమ పట్ల దయ ఉంచాలని విజ్ఞప్తి చేశాడు.First published: October 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...