• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • 15 YEARS GIRL WRITES TO CM YS JAGANMOHAN REDDY FOR HER MOTHERS DEATH CERTIFICATE IN NELLORE DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Andhra Pradesh: అధికారుల నిర్లక్ష్యం.. ఏకంగా సీఎంకే లేఖరాసిన బాలిక.. స్పందించిన మంత్రి

నోషితకు డెత్ సర్టిఫికెట్ అందజేస్తున్న అధికారులు

ప్రజలకు ఏ చిన్న సర్టిఫికెట్ కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. వెంటనే పని కావాలంటే రికమండేషన్లు, తెలిసివాళ్లతో ఫోన్లు చేయించాలి.

  • Share this:
    ప్రజలకు ఏ చిన్న సర్టిఫికెట్ కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. వెంటనే పని కావాలంటే రికమండేషన్లు, తెలిసివాళ్లతో ఫోన్లు చేయించాలి. కానీ ఎవరి అండ లేనివారికి గవర్నమెంట్ ఆఫీసులో పని కావాలంటే మాత్రం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. అలా తన తల్లి డెత్ సర్టిఫికెట్ కోసం అధికారుల చుట్టూ తిరిగిన ఓ బాలిక.. వారి నిర్లక్ష్యాన్ని భరించలేక ఏకంగా ముఖ్యమంత్రికే లేఖరాసింది. వివరాల్లోకి వెళ్తే... నెల్లూరు జిల్లా అల్లూరుకు చెందిన బిరుదవోలు నోషిత అనే బాలికకు చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. నెలరోజుల క్రితం తల్లి కూడా గుండెపోటుతో మృతి చెందింది. తల్లిదండ్రులను కోల్పోయిన నోషిత.. తల్లి డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఐతే ఆమె కరోనాతో చనిపోయిందన్న పుకార్లు రావడంతో డాక్టర్ సర్టిఫికెట్ లేనిదే డెత్ సర్టిఫికెట్ జారీ చేయవద్దని అధికారులు ఆదేశించారు. దీంతో ఇప్పుడురా.. అప్పుడు రా అంటూ నోషితను తిప్పించుకోవడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన ఆమె.. ఏకంగా సీఎంకు లేఖరాసింది.

    ''జగన్‌ మామయ్యా..! చిన్నప్పుడే తండ్రికి దూరమయ్యాను. కళ్లల్లో పెట్టుకొని చూసుకున్న తల్లి ప్రాణాలు కోల్పోయింది. మైనర్‌ని అయిన నేను అమ్మమ్మ సంరక్షణలో ఉంటున్నా. అమ్మ డెత్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా. మంజూరు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వేధిస్తున్నారు. విసిగిపోయి మానసికంగా కుంగిపోయాను'' అంటూ లేఖ రాసింది. తన లేఖను రిజిస్టర్ పోస్టు ద్వారా ముఖ్యమంత్రికి పంపింది.

    ఇది చదవండి: కాబోయే భర్తతో కలిసి షికారుకు వెళ్లిన యువతి... అక్కడే మాటువేసిన మృగాళ్లు.. తర్వాత ఏం జరిగిందంటే..!


    ఐతే ఈ లేఖ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని.. వెంటనే అధికారులతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా జెడ్పీ సీఈఓ పి సుశీల, DMHO డాక్టర్ రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి నోషిత సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అల్లూరు మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించారు. దీంతో 15 నిముషాల్లో నోషితకు తన తల్లి అనుపమ పేరుతో డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు. అధికారులు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి నోషితకు డెత్ సర్టిఫికెట్ అందజేశారు.

    ఇది చదవండి: దేవుడా...! ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. మాటలకందని విషాదం ఇది.


    కొన్ని సాంకేతిక  కారాణాల వల్ల డెత్ సర్టిఫికెట్ జారీ చేయడం ఆలస్యమైందని అధికారులు వివరించారు. నోషిత తల్లి అనుపమ మే 5వ తేదీన కొవిడ్ తో నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారని.., నిబంధనల ప్రకారం నెల్లూరులో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కానీ నోషిత ఆలూరులో నివాసముంటుండంతో అక్కడే దరఖాస్తు చేశారన్నారు. అందుకే డెత్ సర్టిఫికెట్ జారీలో ఆలస్యమైందని వివరించారు.
    Published by:Purna Chandra
    First published: