మందు బందు...మూడరోజుల చుక్కలేదు కిక్కు లేదు

ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చేయాలని హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు.

news18-telugu
Updated: April 10, 2019, 9:04 AM IST
మందు బందు...మూడరోజుల చుక్కలేదు కిక్కు లేదు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 10, 2019, 9:04 AM IST
ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ఏర్పాట్లలో బిజీ అయ్యింది ఎన్నికలసంఘం. ఈ నేపథ్యంలో మూడురోజుల పాటు మందును బంద్ చేయాలని నిర్ణయించింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 వరకు మందు షాపులన్నీ మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం అందితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఓటింగ్ ప్రశాంతంగా నిర్వహించేదుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చేయాలని హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం పోలింగ్ ముగిసే సమయం సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు వుంటాయని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడటం నిషేధం అని అన్నారు. ఇటే ఏపీ పోలీసులు కూడా 144 సెక్షన్ విధించారు. మందు షాపుల్ని మూడురోజుల పాటు మూసివేయించారు.

మద్యం అమ్మకాలనూ నిషేధిస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. కల్లు దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, మిలటరీ క్యాంటీన్లన్నీ మంగళవారం ఉదయం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు మూసి వుంచాలని ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు అనుమతులు లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు చేయరాదని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చరాదని, పరిమితికి మించి శబ్దం చేసే వారిపైనా చర్యలుంటాయని అన్నారు. ఆంక్షలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు.

 

  
First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...