Raghurama Krishnam Raju: రఘరామ కృష్ణంరాజుకు 14 రోజుల రిమాండ్.. కానీ అప్పటివరకు జైలుకు తరలించేందుకు నో..

Raghurama Krishnam Raju: రఘరామ కృష్ణంరాజుకు 14 రోజుల రిమాండ్.. కానీ అప్పటివరకు జైలుకు తరలించేందుకు నో..

రఘురామ కృష్ణంరాజు(ఫైల్ ఫొటో)

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు(Raghurama Krishnam Raju) సీఐడీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

  • Share this:
    నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు(Raghurama Krishnam Raju) సీఐడీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ నెల 28వరకు ఆయనకు రిమాండ్‌ విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఎంపీ రఘరామకృష్ణంరాజు కాళ్లపై గాయాలు ఉండటంతో.. ఆయనను ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశించింది. ఇక, ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించనున్నారు. అనంతరం ఆయనను రమేష్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తారు. రఘరామకృష్ణం రాజు ఆరోగ్యం మెరుగుపడేవరకు జైలు తరలించకూడదని కోర్టు పేర్కొంది. ఆయన శరీరంపై కనిపిస్తున్న గాయాలపై న్యాయస్థానం నివేదిక కోరింది. మరోవైపు ఆయనకు వై కేటగిరి భద్రత కొనసాగుతుందని తెలిపింది.

    ఇక, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు జేశారనే అభియోగాలపై సీఐడీ అధికారులు.. ఎంపీ రఘురామ కృష్ణంరాజును అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో రఘురామ చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. బెయిల్ కోసం కింది కోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది.

    ఇక, సీఐడీ పోలీసులు గుంటూరులోని సీబీసీఐడీ ప్రత్యేక కోర్టులో రఘురామను హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టులో కోర్టులో హైడ్రామా చోటుచేసుకుంది. కోర్టుకు హాజరైన సందర్భంగా సీఐడీ పోలీసులపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. సీఐడీ పోలీసులు తనను కొట్టారని లాయర్లకు తెలిపారు. రాత్రంతా వేధింపులకు గురిచేశారని జడ్జికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన కాళ్లపై గాయాలతో కూడిన ఫోటోలను కూడా ఆయన సమర్పించినట్లు తెలుస్తోంది.

    మరోవైపు రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాది ఆదినారాయణరావు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ప్రవీణ్‌ నేతృత్వంలో స్పెషల్‌ డివిజన్‌ బెంచ్‌ ఏర్పాటైంది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించిన హైకోర్టు.. ‘‘కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా కొడతారు? రఘురామకు తగిలినవి తాజా గాయాలని తేలితే తీవ్ర పరిణామాలు’’ తప్పవని హెచ్చరించింది. ఎంపీ రఘురామ ఒంటిపై గాయాలను వెంటనే మెడికల్ బోర్డుతో పరిశీలిన చేయించాలని ఆదేశించింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు