చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ బోల్తా.. 12 మంది మృతి

బ్రేకులు ఫెయిల్ కావడంతో ఓ భారీ కంటైనర్.. రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లి, అనంతరం రోడ్డుపై బోల్తా పడింది. కంటైనర్ కింద ఆటో, ఓమ్నీ వ్యాన్, బైక్ చిక్కుకున్నాయి.

news18-telugu
Updated: November 8, 2019, 7:51 PM IST
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ బోల్తా.. 12 మంది మృతి
చిత్తూరులో రోడ్డు ప్రమాదం
  • Share this:
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు సమీపంలో మొగిలి ఘాట్ రోడ్డులో కంటైనర్ బోల్తా పడింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఓ భారీ కంటైనర్.. రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లి, అనంతరం బోల్తా పడింది. కంటైనర్ కింద ఆటో, ఓమ్నీ వ్యాన్, బైక్ చిక్కుకున్నాయి. అనంతరం కంటైనర్ నుంచి భారీగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 12 మంది స్పాట్‌లోనే చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కంటైనర్ బెంగళూరు నుంచి చిత్తూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

రోడ్డు ప్రమాదం దృశ్యాలు:

Published by: Shiva Kumar Addula
First published: November 8, 2019, 7:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading