మత్స్యకారుల పంట పండింది.. 1150 కిలోల టేకు చేప..

మత్స్యకారులకు చిక్కిన భారీ టేకు చేప

రోజువారీ లాగే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అదృష్టం టేకు రూపంలో వలకు చిక్కింది. అయితే బుధవారం ఈ భారీ టేకు చేపను ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం పడవ నుంచి ప్రొక్లెయిన్ సాయంతో బయటకు తీసుకొచ్చారు.

  • Share this:
    వారంతా మత్స్యకారులు. రోజంతా కష్టపడి చేపలు పడితేనే వారికి పూట గడుస్తుంది. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లే జాలర్లు.. ఒక్కోసారి వారం రోజులైనా ఒడ్డుకు వచ్చే పరిస్థితి ఉండదు. దండిగా చేపలు వలకు చిక్కితేనే వారు తమ కుటుంబాలను నెట్టుకువస్తారు. సముద్రంలోకి వెళ్లే ముందు గంపెడాశతో వెళ్తారు. ఒక్కోరోజు వారి ఆశల అంచనాలు అందుకుంటారు. మరో రోజూ గంపెడు కాదు కదా.. గుప్పేడు చేపలు దొరికే పరిస్థితి ఉండదు. అయితే మత్స్యకారులకు ఇది నిత్య పోరాటమే. ఆ తరహాలోనే సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని అనుభవం ఎదురయ్యింది. ఒకటీ కాదు రెండు కాదు ఏకంగా 1150 కిలోల భారీ టేకు చేప వారి వలకు చిక్కింది. ఈ ఘటన కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నానికి చెందిన మత్స్యకారులకు ఎదురయ్యింది. రోజువారీ లాగే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అదృష్టం టేకు రూపంలో వలకు చిక్కింది.

    అయితే బుధవారం ఈ భారీ టేకు చేపను ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం పడవ నుంచి ప్రొక్లెయిన్ సాయంతో బయటకు తీసుకొచ్చారు. మార్కెట్‌లో ఈ చేపను రూ.37 వేలకు విక్రయించినట్టు మత్స్యకారులు తెలిపారు. ఇలాంటి టేకు చేపలు అరుదుగా దొరుకుతుంటాయని అధికారులు పేర్కొన్నారు. ఏదిఏమైనా ఈ టేకు చేపతో మత్స్యకారుల పంట పండిందనే చెప్పాలి.
    Published by:Narsimha Badhini
    First published: