Home /News /andhra-pradesh /

104 CALL CENTRE TO BE STRENGTHEN FOR RAISING COMPLAINTS ON TREATMENT AT GOVERNMENT HOSPITALS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

AP News: ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ సరిగా లేదా.. అయితే ఈ నెంబర్ కు కాల్ చేయండి..

ఎంటీ కృష్ణబాబు

ఎంటీ కృష్ణబాబు

ప్రభుత్వాస్పత్రుల్లో ఫిర్యాదుకు 104 కాల్ సెంటర్ - 104 call centre to be strengthen for raising complaints on Government Hospitals

    ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి (Tirupati) రుయా ఆస్పత్రి ఘటన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లాలంటేనే జనం భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. విజయవాడ (Vijayawada), వైజాగ్ కేజీహెచ్ వంటి పెద్దాస్పత్రుల్లోనూ సిబ్బంది తీరు, వైద్యసేవలపై విమర్శలు రావడం, రోగుల నుంచి సిబ్బంది వసూళ్లు, అంబులెన్సులు అందుబాటులోకి లేకపోవడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి కృష్ణబాబు.. కీలక ఆధేశాలిచ్చారు. ఇకపై 104 కాల్ సెంటర్ ను బలోపేతం చేస్తామన్నారు. వైద్య సేవలపై ఫిర్యాదులకోసం 104 కాల్ సెంటర్ ను వినియోగిస్తామని.., ఆస్పత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఈ నెంబర్ కు కాల్ చేయవచ్చని తెలిపారు.

    అంబులెన్స్ డ్రైవర్ల ప్రవర్తన , డబ్బులు డిమాండ్ చేయడం, ఆరోగ్య శ్రీ సేవల్లో అలసత్వం, వాహనాలు అందుబాటులో లేకపోవడం వంటి వాటిపై 104కు ఫిర్యాదు చెయ్యొచ్చని.., వాటిపై వెంటనే స్పందించి చర్యలు తీసకుంటామన్నారు. కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉన్న కాల్ సెంటర్ ను ఫిర్యాదులకు కూడా వినియోగిస్తామన్నారు.

    ఇది చదవండి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రెండు నెలల్లో అందించే సంక్షేమ పథకాలివే..!


    ఫీవర్ సర్వేను తేలిగ్గా తీసుకోవద్దని.., హెల్త్ కేర్ , ఫ్రంట్ లైన్ వర్కర్లు , అరవయ్యేళ్లు పైబడిన వారికి ప్రికాషనరీ డోస్ ను వేగవంతం చెయ్యాలని కృష్ణబాబు ఆదేశించారు. లక్ష్యాన్ని చేరుకునేలా స్పెషల్ డ్రైవ్ ను చేపట్టాలన్న ఆయన.., జిల్లాల్లో క్యాడర్ వారీగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ప్రతినెలా శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రులకొచ్చే పేదలకు సేవలందించడంలో ఏమాత్రం అలసత్వం వహించొద్దని.., వైద్యం అనంతరం పేదలు సంతోషంగా తిరిగి ఇంటికెళ్లాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. కొవిడ్ కు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నింటినీ ఈనెల 25లోగా పంపించాలని ఆదేశించారు. ఆ వచ్చే బిల్లుల విషయంలో సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

    ఇది చదవండి: తప్పుచేస్తే ఎవరైనా ఒకటే..! సీఎం జగన్ సంచలన నిర్ణయం..


    ఏ ఒక్క ప్రభుత్వాసుపత్రిలోనూ మందుల కొరత అనేది రాకూడదని.., కొనుగోలుకు రూ.650 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మందుల కొనుగోలుకు బడ్జెట్ కొరత లేదని.., స్థానికంగా మందుల కొనుగోలుకు కూడా ఒకేవిధమైన టెండర్ ప్రక్రియను తీసుకొస్తున్నామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సిసి కెమెరాలు , బయోమెట్రిక్ హాజరు పరికరాలు సమర్ధవంతంగా నిర్వహించాలని., ఈ విషయంలో డిఎంఇ, డిహెచ్ లు బాగా వెనుకబడి ఉన్నారన్నారు. మహాప్రస్థానం కోసం అదనపు వాహనాల్ని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామన్న కృష్ణబాబు.., జిల్లా, టీచింగ్ ఆసుపత్రులతో పాటు ఇతర ఆసుపత్రులకు కూడా మహాప్రస్థానం సేవల్ని విస్తరిస్తామని స్పష్టం చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Government hospital

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు