హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన ఆ బాలిక మృతి.. ప్రభుత్వ హత్యంటూ చంద్రబాబు ఆగ్రహం

Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన ఆ బాలిక మృతి.. ప్రభుత్వ హత్యంటూ చంద్రబాబు ఆగ్రహం

సీఎం జగన్‌తో సంధ్య (పాత ఫొటో)

సీఎం జగన్‌తో సంధ్య (పాత ఫొటో)

Andhra Pradesh: రోజుల క్రితం అల్లూరి జిల్లాలో సీఎం జగన్‌తో చలాకీగా మాట్లాడిన బాలిక అనారోగ్యంతో మరణించింది. డెంగీ కాటుకు బలైపోయింది. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు మండిపడ్డారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఆ బాలిక వయసు పదేళ్లు. చాలా తెలివైన అమ్మాయి. చదువుల్లో ముందుంటుంది. అందరితో ఈజీగా కలిసి పోతుంది. చాలా చలాకీగా మాట్లాడుతుంది. మాట తీరుతో ఆకట్టుకుంటుంది. ఇటీవలే సీఎం జగన్‌ (YS Jagan)ను కూడా కలిసి మాట్లాడింది. ఐతే ఆ పాప ఇప్పుడు లేదు. సీఎంను కలిసి.. నెల రోజులు తిరిగే సరికి.. విగత జీవిగా మారిపోయింది. డెంగీ కాటు (Dengue Fever)కు బలైపోయింది. ఆ పాప మరణం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. వైఎస్ జగన్ అసమర్థ పాలన వల్లే పాప మరణించిందని.. వరద ముంపు ప్రాంతాల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోకపోవడం వల్లే.. ఈ దుర్ఘటన జరిగిందని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.


అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా చింతూరు మండలం కుయిగూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామ మాజీ సర్పంచ్ ఏసుబాబు కూతురు సంధ్య డెంగీతో చనిపోయింది. ఆ పాప చింతూరులో ఐదో తరగతి చదువుతోంది. ఇటీవల సంధ్య తండ్రి ఏసుబాబు అనారోగ్యం పాలయ్యాడు. తీవ్రంగా జ్వర రావడంతో భద్రాచాలం ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో సంధ్య తన తండ్రితో పాటు ఆస్పత్రిలో ఉంది. ఏసుబాబుకు జ్వరం తగ్గాక.. సోమవారం సొంతూరుకు వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత సంధ్యకు కూడా జ్వరం వచ్చింది. మళ్లీ భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రికే వెళ్లారు. సాధారణ జ్వరమేనని..ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు. మందులు ఇచ్చి పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత.. పాప ఆరోగ్యం క్షీణించింది. సంధ్య పరిస్థితిని చూసి ఆందోళన చెందిన ఏసుబాబు.. ఆమెను చింతూరు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. డెంగీ సోకినట్లు తెలిపారు. డెంగీ అని తేలడంతో తండ్రి మరింత ఆందోళన చెందాడు. హుటాహుటిన భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. పరిస్థితి విషమించడంతో తిరిగి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయింది.


జులైలో వచ్చిన వరదలతో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని చాలా గ్రామాలు నీటమునిగాయి. కొన్ని వారాల పాటు వరద ముంపులోనే మగ్గాయి. బాధితులను పరామర్శించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్.. జులై 27న చింతూరు మండలం కుయిగూరుకు వెళ్లారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ ఊరు మాజీ సర్పంచ్ ఏసుబాబుతో పాటు ఆయన కూతురు సంధ్య కూడా అక్కడికి వచ్చింది. ఆ బాలిక చురుగ్గా తిరుగుతూ కనిపించడంతో.. సీఎం జగన్ తన దగ్గరకు పిలిపించుకొని మాట్లాడారు. బాలిక వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంధ్య కూడా ఎంతో చలాకీగా సీఎంతో మాట్లాడింది. అంత యాక్టివ్‌గా ఉండే సంధ్య.. ఇప్పుడు డెంగీతో మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గోదావరి వరదల తర్వాత ఏజెన్సీలో విష జ్వరాలు పెరిగాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయినట్లు వెల్లడించారు.

ఈ ఘటనపై ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. చింతూరులో వరదల సమయంలో సిఎం జగన్ పిలిచి మాట్లాడిన బాలిక డెంగితో చనిపోయిందని.. దీనికి వచ్చి సీఎం ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ హత్య కాదా.. అని మండిపడ్డారు. వరద ప్రాంతాల్లో దోమల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Ys jagan

ఉత్తమ కథలు