news18-telugu
Updated: December 31, 2020, 2:21 PM IST
కొందరు వలస కూలీలు చెన్నై నుంచి కోల్కతాకు బయలుదేరారు. ఐతే బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం బోల్తాపడింది.
నెల్లూరులో జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావలి మండలం గౌరవరం వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరు వలస కూలీలు చెన్నై నుంచి కోల్కతాకు బయలుదేరారు. ఐతే బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది.
అనంతరం బోల్తాపడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
December 31, 2020, 9:30 AM IST