Telangana: సంవత్సరానికి రూ. 12 లక్షల సంపాదన.. ఇలా చేస్తే మీరు కూడా సంపాదించవచ్చు.. అదెలాగో చూద్దాం..

కౌటిల్య కృష్ణన్

Black rice crop: న‌ల్ల బియ్యం మ‌ళ్లీ పండాయి. వేద వ్య‌వ‌సాయ‌వేత్త కౌటిల్య కృష్ణ‌న్‌.. మ‌రోసారి కృష్ణ వ్రీహి బియ్యాన్ని పండించారు. వేదాల ఆధారంగా రెండ‌వ సారి విజ‌య‌వంతంగా త‌న పొలంలో న‌ల్ల బియ్యాన్ని పండించిన‌ట్లు కౌటిల్య కృష్ణ‌న్ తెలిపారు.

  • Share this:
    వేద వ్యవసాయ ప్రయోగాలతో కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ మరోసారి సక్సెస్ సాధించారు. కరీంనగర్ జిల్లా ఖాసింపేట గ్రామంలోని తనకున్న 3 ఎకరాల పొలంలో కృష్ణ వ్రీహీ (నల్ల బియ్యం) పండించడంలో విజయవంతమయ్యారు. ఎకరానికి 2లక్షల చొప్పున 3ఎకరాలకు 6లక్షలు అలాగే పంట వ్యవధి కాలం ఆరు నెలలు కాబట్టే సంవత్సరం లో రెండు పంటలు వేసి సంవత్సర కాలంలో రూ. 12లక్షలు సంపాదిస్తున్నాడు కృష్ణ. తెలంగాణ ప్రాంతంలో రైతులు అనాదిగా అనుసరించే మండి కట్టే పద్ధతితో పాటు వేద వ్యవసాయ పద్ధతులు అనుసరించానని కౌటిల్య కృష్ణ చెప్పారు. డిసెంబర్ మాసంలో విత్తనం వేసాడు. ఇప్పుడు పంట కోతకు వచ్చిందని కౌటిల్య తెలిపారు. వేద వ్యవసాయంలో భాగంగా పాలు, తేనెతో పాటు అగ్నిహోత్ర భస్మం కూడా వాడినట్లు చెప్పారు. ఆవుపేడను ఎరువుగా వాడినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో వేద వ్యవసాయం ద్వారా వంద శాతం పంట పండిందని చెప్పారు.కృష్ణ బియ్యం బ్రౌన్ రైస్ కన్నా ఎక్కువ ప్రొటీన్ కంటెంట్ కృష్ణ బియ్యంలో ఉంటుంది .

    కృష్ణ బియ్యంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి . గుండె సంబంధిత వ్యాధులు , కేన్సర్ , ఊబకాయం మొదలైన వ్యాధులు నయం కావడంలో కృష్ణ బియ్యం ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు రుజువైంది . కొన్ని రకాల కణుతులపై యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్ చూపిస్తున్నట్లు వెల్లడైంది . యాంథోసయనిన్ అత్యధికంగా గల ధాన్యాల్లో కృష్ణ బియ్యం ఒకటి . దీనిలో 18 ముఖ్యమైన అమినో ఆమ్లాలు , ఐరన్ , జింక్ , కాపర్ , కెరొటిన్ , పైబర్ , విటమిన్లు , మినరల్స్ ఉంటాయి. జిల్లాలోని మిగతా చాలా చోట్ల రైతులు కెమికల్స్‌తో వ్యవసాయం చేశారని, అయితే వేద వ్యవసాయం ద్వారా తన పంట చాలా మెరుగ్గా పండిందని వెల్లడించారు. చుట్టుపక్కల రైతులు కూడా కౌటిల్య పొలాన్ని సందర్శించి ప్రశంసలు కురిపిస్తున్నారు.

    నల్ల వరి పంట


    దేశీయ విత్తనాల వల్ల ప్రయోజనాలివే
    నాటు విత్తనాలు వాడటం ద్వారా పురుగులు వచ్చే శాతం తక్కువ. రుచి బాగుంటుంది. విత్తనాలు వంద శాతం మొలకెత్తే అవకాశం ఉంటుంది.భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కూడా ఉంటుంది. నీళ్లు ఎక్కువగా అవసరం లేదు. ఎలాంటి భూమిలోనైనా పంట బ్రహ్మాండంగా పండుతుంది. పంట దిగుబడి బాగా వస్తుంది. రైతన్నలు నాటు విత్తనాలు నిల్వ చేసుకుని తదుపరి పంటకు మళ్లీ వేసుకోవచ్చు. దేశీయ విత్తనాల్లో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. దేశీయ విత్తనాలు వాడటం వల్ల ఆర్ధికంగా కూడా రైతులు లాభపడతారు. దేశీయ విత్తనాల వల్ల అన్నదాతలు ఆర్ధికంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు.
    Published by:Veera Babu
    First published: