Home /News /సిద్దిపేట /

SIDDIPETA SI SRAVANTI WHO ACHIEVED THREE GOVERNMENT JOBS IN A SINGLE ATTEMPTA SNR MDK

Siddipeta: ఒకేసారి 3ప్రభుత్వ ఉద్యోగాలు..నేను చేసినట్లు చేస్తే వస్తాయంటున్న స్రవంతి

(ఒకేసారి మూడు ఉద్యోగాలు)

(ఒకేసారి మూడు ఉద్యోగాలు)

Siddipeta:జీవితంలో ఉన్నతమైన స్థానం చేరుకోవడానికి లక్ష్యంపై గురి ఉండాలి. మంచి ఉద్యోగం సంపాధించేందుకు విద్య ఒక్కటే అర్హత కాదు దానికి తోడు జనరల్‌ నాలెడ్జ్, ఫిజికల్ ఫిట్‌నెస్, అవకాశాల కోసం వెదికే శ్రద్ధ ఉంటే ఒకటి కాదు ఎన్నైనా ఉద్యోగాలు సాధించవచ్చని నిరూపించారామె.

ఇంకా చదవండి ...
  (M.Veeranna,News18,Medak)
  జీవితంలో ఉన్నతమైన స్థానం చేరుకోవడానికి లక్ష్యంపై గురి ఉండాలి. మంచి ఉద్యోగం సంపాధించేందుకు విద్య ఒక్కటే అర్హత కాదు దానికి తోడు జనరల్‌ నాలెడ్జ్, ఫిజికల్ ఫిట్‌నెస్, అవకాశాల కోసం వెదికే నే శ్రద్ధ ఉంటే ఒకటి కాదు ఎన్నైనా ఉద్యోగాలు సాధించవచ్చని నిరూపించారు సిద్దిపేట(Siddipeta)జిల్లాకు చెందిన ఓ మహిళా పోలీస్ అధికారిణి. ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటి సాధించడానికి పడరాని పాట్లు పడుతున్న ఎందరో నిరుద్యోగులకు ఆమె జీవితం ఓ స్పూర్తి. ఆమె ఎంచుకున్న మార్గం ఓ మార్గదర్శకం. సిద్దిపేట పట్టణానికి చెందిన స్రవంతి (Sravanthi) ఎమ్మెస్సీ(Msc), బీఈడీ(B.ed) పూర్తి చేశారు. ఆ తర్వాత 2020 సంవత్సరంలో పోలీసు ఆఫీసర్‌గా ఉద్యోగం సంపాధించుకున్నారు. ఉద్యోగం సాధించాలన్న తన ప్రయత్నం ఒకటి రెండు కాదు ఏకంగా మూడు ఉద్యోగాలను ఒకేసారి తెచ్చి పెట్టాయి. పోలీస్‌శాఖ(Police Department)లో ఎస్‌ఐ, కానిస్టేబుల్(Constable), హాస్టల్ వార్డెన్(Hostel Warden), గ్రామపంచాయతీ కార్యదర్శిగా ఒకేసారి ఉద్యోగాలు స్రవంతి ముందు క్యూ కట్టాయి. సమాజానికి సేవ చేయడం, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పోలీసు ఉద్యోగమే సరైనదిగా భావించి పోలీస్‌శాఖలో ఎస్‌ఐగా చేరారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వన్ టౌన్‌ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు స్రవంతి.

  టాలెంట్‌ ముందు జాబ్స్‌ ఎంత..
  భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనుకునే ఎందరో నిరుద్యోగ యువత, ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు ఎస్‌ఐ స్రవంతి తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. చదువుతో పాటు జనరల్ నాలెడ్డ్ ఉంటే ఒకటి కాదు ఎన్ని ఉద్యోగాలనైనా సాధించవచ్చని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలతో పాటు పోలీసుశాఖలో కూడా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన క్రమంలో ఆమె నిరుద్యోగ యువతకు పలు సూచనలు, మెళకువలు చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లా పోలీసుశాఖలో ఉద్యోగాల కోసం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసింది పోలీస్‌ యంత్రాంగం. వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

  ఉద్యోగం సంపాధించడం సులువే..
  సర్కారు కొలువు సాధించడానికి చదువు సరిపోతుందేమో కాని పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో జాబ్‌ కొట్టాలంటే ఫిజికల్ ఫిట్‌నెస్, బుద్ధిబలం కూడా మెండుగా ఉండాలని తెలిపారు స్రవంతి. ముఖ్యంగా రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్‌ నాలెడ్జ్‌ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలంటున్నారు. మల్టీ పర్పస్‌ సబ్జెక్టుల్లో ఇచ్చే పదాలకు అర్ధాలు వెదుక్కునే పనిలేకుండా ఈ అంటే ఈరోజు అనే పదాన్ని గుర్తు పెట్టుకోవాలంటున్నారు. పోలీస్‌ జాబ్‌కి అత్యంత ముఖ్యమైనది ఫిట్‌నెస్‌ టెస్ట్‌. ఇది పాసవడానికి ముందు నుంచే ప్రిపరేషన్ ఉండాలన్నారు. ఓ ప్లాన్‌ ప్రకారం ముందుకు వెళ్తేనే ప్రిలిమినరీ ఈవెంట్స్, మెయిన్స్‌లో గట్టెక్కి ఉద్యోగం సాధిస్తామని స్రవంతి తెలిపారు.

  నేను చెప్పినట్లు చేస్తే చాలు..
  ట్రైనింగ్‌ టైమ్‌లో దొరికే కొద్ది సమయాన్నే సద్వినియోగం చేసుకొవాలంటున్నారు స్రవంతి. రోజువారి తీసుకునే ఆహారం విషయంలో కోడిగుడ్డు, పండ్లు, శనగలు, ఇతర పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా బరువు పెరగకుండా ఉంటారని సూచిస్తున్నారు. అలాగే శ్వాసకు సంబంధించిన యోగా వంటికి చేస్తే ఉద్యోగం దానంతట అదే వచ్చి తీరుతుందని పోలీస్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరికి అమూల్యమైన విషయాలను వివరించారు స్రవంతి. తన లాగే ఎందరినో పోలీసుశాఖలో ఉద్యోగస్తులు తీర్ది దిద్దడానికి బీజేఆర్ భవన్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రైనింగ్‌ సెంటర్‌లో శిక్షణ ఇస్తున్నారు స్రవంతి.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Medak District news, Siddipeta

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు