PHARMA COMPANY THAT GIVES FREE VEGETABLES ALONG WITH SALARY TO THE EMPLOYEES IN SANGAREDDY SNR MDK
Sangareddy: అక్కడ జాబ్ చేస్తే జీతంతో పాటు వెజిటెబుల్స్, ఫ్రూట్స్ ఫ్రీ ఎందుకంటే..
(ఉద్యోగులకు ఫ్రూట్స్ ఫ్రీ)
Sangareddy:పరిశ్రమలు అంటేనే కాలుష్యం వెదజల్లే కారకాలుగా భావిస్తారు అందరు. కాని సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఫార్మా కంపెనీ మాత్రం అందుకు మేం భిన్నం అంటోంది. రసాయన పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి ఉపాధి కల్పిస్తూనే జీతంతో పాటు ఉచితంగా పరిశ్రమ ప్రాంగణంలో పండే కూరగాయలు, పండ్లను ఉచితంగా అందిస్తున్నారు.
(K.Veeranna,News18,Medak)
పరిశ్రమల పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది కాలుష్యం. ఏ పరిశ్రమ నుంచి అయినా వెలువడే వ్యర్ధాలు, పరిశ్రమల పరిసరాల కారణంగా ఆ ప్రాంతం కాలుష్యం వెదజల్లుతుంది. ఆ ప్రాంత ప్రజలు కాలుష్యాన్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే పరిశ్రమలు కాబట్టి స్థానిక ప్రజలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కలుగుతాయనే భరోసాతో వీటన్నింటిని భరిస్తూ కాలం వెళ్లదీస్తుంటారు. సంగారెడ్డి (Sangareddy)జిల్లా గుమ్మడిదల (Gummadidala)మండలం అన్నారం(Annaram) పారిశ్రామికవాడలో ఉన్న అన్నోరా పార్మా కంపెనీ(Annora Pharma Company)వీటికి కాస్త భిన్నంగా ఉంటుంది. పరిశ్రమ లోపలికి వెళ్లి చూస్తే పచ్చదనం, ప్లవర్స్తో పాటు ఫార్మా కంపెనీలో మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షిస్తున్నారు. మూడు లక్షళ మొక్కలతో పాటు గోవులను సైతం పెంచుతున్నారు. అంతే కాదు ఈ పరిశ్రమలో ఇంకో ప్రత్యేకత ఉంది. ఇందులో పని చేసే కార్మికులకు ఇక్కడ పండించే కూరగాయలు, పండ్లను ఉచితంగా అందజేస్తారు. ముఖ్యంగా యాపిల్(Apple), సపోట (Sapota) వాటర్ మిలన్ (Watermelon), జామ (Guava)చెట్లను పెంచుతూ ఫార్మా కంపెనీలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వంకాయ, ములక్కాయ, టమాట, బీరకాయ లాంటి కూరగాయల్ని ఉచితంగా అందజేస్తున్నారు. ఈ కూరగాయల మొక్కలు, పండ్ల చెట్లు పెరిగేందుకు వాటర్ ఫౌంటేన్(Water Fountain)ను కూడా ఏర్పాటు చేశారు.
ఫార్మా కంపెనీ కాదు..పండ్లిచ్చే పరిశ్రమ
జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదువేల వరకు భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా రసాయన పరిశ్ర మలు ఉన్నాయి. ఆ రసాయన పరిశ్రమల నుంచి ఎక్కువగా వ్యర్ధ, ఘాటు వాసన వస్తుండడంతో దీనిని నివారిం చేందుకుగానూ ఎక్కువగా యాజమాన్యాలు మొక్కలు నాటుతుంటారు. అలాగే నాటిన మొక్కలను సంరక్షిం చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కాని అన్నోరా ఫార్మా కంపెనీ యాజమాన్యం మాత్రం మూడు లక్షల వరకు మొక్కలను నాటి వాటిని రక్షించేందుకు ప్రతీక్షణం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
ఉద్యోగులకు ఉచితంగా కూరగాయలు..
పరిశ్రమ పేరు చెబితే భయపడే పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో అన్నారం పారిశ్రామికవాడలో అడుగుపెడుతుంటూనే రోడ్డుకి ఈరువైపులా ఏపుగా పెరిగిన మొక్కలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. పరిశ్ర మలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల గదుల్లో ఏర్పాటు చేసిన మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతే కాదు ఈ ఫార్మా కంపెనీకి చెందిన స్తలంలోనే వరి సాగు కూడా చేపడుతున్నారు. ప్రభుత్వం హరితహారం పెట్టకముందే తమ పరిశ్రమలో మొక్కలు నాటడం, చెట్లను పెంచడం, కూరగాయలు, పండ్ల చెట్లను ఫార్మింగ్ చేస్తూ వచ్చిన ఫలాలు, కూరగాయల్ని అన్నోరా పార్మా కంపెనీలో పనిచేసే కార్మికులు అందజేస్తున్నట్లుగా అన్నోరా ఫార్మా డిప్యూటీ మేనేజర్ వెంకటరెడ్డి తెలిపారు. కార్మికులు సైతం ఈతరహా సదుపాయం ఈ ప్రాంతంలో ఏ పరిశ్రమలో లేదని..తమ సంస్థను పారిశ్రామికవాడలోని మిగిలిన కంపెనీలు ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.