హోమ్ /వార్తలు /%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BF%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F /

Harish rao: మహిళా సంఘాలకు రూ. 5 కోట్ల నిధులు, 5 ఎకరాల స్థలం: మంత్రి హరీశ్​ రావు

Harish rao: మహిళా సంఘాలకు రూ. 5 కోట్ల నిధులు, 5 ఎకరాల స్థలం: మంత్రి హరీశ్​ రావు

మంత్రి హరీశ్ రావు (ఫైల్)

మంత్రి హరీశ్ రావు (ఫైల్)

సిద్ధిపేట జిల్లాలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో 2020-21 యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కమీషన్ డబ్బులు రూ.11.72 కోట్ల చెక్కులు డ్వాక్రా మహిళ సంఘాలకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Siddipet, India

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు దండగ అని, దాని ద్వారా ఒక్క ఎకరం నీళ్లు పారలేదని బీజేపీ దేశ నాయకులు చెబుతుండ్రు. కళ్లు ఉండీ కూడా చూడలేనీ కబోదులు లెక్క.. దుర్మార్గంగా బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారు. అలాంటి అబద్ధాల కోరులకు మీరే శిక్ష వేయాలి”అని  ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) పిలుపునిచ్చారు. సిద్ధిపేట (Siddipet) జిల్లాలో విపంచి ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం డీఆర్డీఏ ఆధ్వర్యంలో 2020-21 యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కమీషన్ డబ్బులు రూ.11.72 కోట్ల చెక్కులు డ్వాక్రా మహిళ సంఘాలకు మంత్రి పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటీవల వరంగల్ (Warangal) వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోం మంత్రి అమిత్ షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, వారి మాటల్లో అర్థం లేదన్నారు. రాష్ట్రంలో గణనీయంగా మార్పు వచ్చిందని, కాళేశ్వరం నీళ్ల ద్వారా భూమికి బరువయ్యేంత పంట దిగుబడి పెరిగిందని మంత్రి  (Minister Harish rao)చెప్పారు. ఒకప్పుడు నిండన చెరువులు కనపడేవని, కానీ ఇప్పుడు నిండిన చెరువులు కన్పిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో పింఛన్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేదని, ఇప్పుడు వేల సంఖ్యలో ఇస్తున్నామని పేర్కొన్నారు.ఒకప్పుడు సిద్ధిపేటలో కాంగ్రెస్ (Congress) హయాంలో 20 వేల మందికి కేవలం ఒక్కొక్కరికీ రూ.200 పింఛన్లు ఉండేవని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో 54 వేల మందికి పింఛన్లు (Pensions) ఇస్తున్నట్టు చెప్పారు. ఇది పేద ప్రజల పట్ల తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని వ్యాఖ్యానించారు మంత్రి. కాంగ్రెస్ హయాంలో సర్కారు దవాఖాన పరిస్థితి అద్వాన్నంగా ఉండేదని, ఇప్పుడు ప్రయివేటు ఆసుపత్రికి ధీటుగా వసతులు కల్పించినట్టు హరీశ్​ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్ని దుకాణాలు బంద్ అయ్యాయనీ, కాలిన మీటర్లు, జనరేటర్లు, ప్రయివేటు దవాఖానాలు.. ఇలా అన్ని వెనుకబడి పోయాయన్నారు.


మహిళా సమాఖ్యకు రూ.5 కోట్లు.. 


అడగంది.. అమ్మైనా అన్నం పెట్టదు. మిట్టపల్లి గ్రామ శివారులో మీ మహిళా సమాఖ్య సంఘాలకు (women groups) ఏదో ఒక సాయం చేయాలని, మీకు అన్ని వసతులతో జిల్లా మహిళ సమాఖ్య భవనం, ఉమెన్ వర్కింగ్ హాస్టల్, మహిళా ప్రాంగణం కోసం 5 ఎకరాల స్టలం, భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీశ్  (Minister Harish rao) ప్రకటించారు.


KCR Meeting With farmers: రైతుల సమస్యలు తీరాలంటే అదొక్కటే మార్గం: సీఎం కేసీఆర్​


మూడింటికి ఒకే చోట స్టలం సేకరణ కోసం ఆర్డీవోకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 20 ఏండ్ల క్రితం ఎక్కడో ఒక చోట కొనుగోలు కేంద్రం ఉండేదని, ఇప్పుడు ప్రతీ గ్రామంలో ఒక ధాన్యం కొనుగోళ్ల కేంద్రం ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీశ్​ (Minister Harish rao) పేర్కొన్నారు. ఒకప్పుడు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తే గోదారి జలాల పుణ్యమా అని ఈ యేటా 5.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయిందన్నారు. ఇది కాళేశ్వరం నీటి ద్వారా సాధ్యం అయిందని, ఈ విషయాల్ని ప్రజలకు తెలిసేలా సవివరంగా చెప్పాలని సూచించారు. మీకు చెబితే లక్ష మందికి చెపినట్లేననీ, కింది స్థాయిలో ప్రచారం చేయాలని వాస్తవాలు ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలని సూచించారు.


సిద్దిపేటలో 900 పడకల ఆసుపత్రి..


ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ సంఖ్య పెరగాలని, పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలు పొందాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలు వివరించాలని సమాఖ్య మహిళలకు మంత్రి హరీశ్​ సూచించారు. హుస్నాబాద్ లో100, దుబ్బాకలో 100, గజ్వేల్ లో 250 పడకల ఆసుపత్రులలో ప్రజలకు సేవలు అందుతిన్నాయని, చేర్యాలలో రూ.10 కోట్లతో కొత్త ఆసుపత్రికి నిధులను కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. సిద్దిపేటలో 900 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారం రోజుల్లోపు వానాకాలం పంట 30 శాతం కమీషన్, నెలలోపు యాసంగి పంట 30 శాతం కమీషన్ డబ్బులు ఇప్పిస్తానని మహిళా సమాఖ్య సంఘాలకు మంత్రి హామీనిచ్చారు.

First published:

Tags: Harish Rao, Self help groups, Siddipet, Womens association

ఉత్తమ కథలు