హోమ్ /వార్తలు /%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BF%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F /

Medak; మొక్క జోన్న లో డ్రాగన్ ఫ్రూట్...భలే ఐడియా గురూ!..

Medak; మొక్క జోన్న లో డ్రాగన్ ఫ్రూట్...భలే ఐడియా గురూ!..

మొక్క జోన్న లో డ్రాగన్ ఫ్రూట్...భలే ఐడియా గురూ

మొక్క జోన్న లో డ్రాగన్ ఫ్రూట్...భలే ఐడియా గురూ

అమెరికా (america),  చైనా (china) వంటి దేశాల్లో పండే డ్రాగన్ ఫ్రూట్స్ మెట్టప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతులు సాగు చేస్తున్నారు

 • News18 Telugu
 • Last Updated :
 • Medak, India

  K.veeranna, News 18, Medak jilla   


  Medak; అమెరికా (america),  చైనా (china) వంటి దేశాల్లో పండే డ్రాగన్ ఫ్రూట్స్ మెట్టప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతులు సాగు చేస్తున్నారు. ఆరోగ్య రీత్యా అన్ని రకాల విటమిన్లు, పోషక పదార్థాలు ఈ పండులో లభిస్తుండడంతో బయట డ్రాగనూటకు మంచి మార్కెటింగ్ లో  మంచి పేరు ఉంది. ఒకసారి వేస్తే దాదాపు 30సంవత్సరాలకు పైగా డ్రాగన్ ఫ్రూట్స్ పంట దిగుబడి వస్తుంది. ఈ పంటను వారసత్వంగా తనకు వచ్చిన వ్యవసాయ భూమిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ సాగు చేస్తూ.చుట్టుపక్కలున్న రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకు వచ్చిన రెండున్నర ఎకరాల్లో పంట సాగు చేస్తు అందరికీ ఆకర్షణీ నిలుస్తున్న కానిస్టేబుల్ సిద్దిపేట జిల్లాఅక్కన్నపేట మండలం పంతులుతండాకు చెందిన బానోతు దూదియనాయక్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నా వృత్తిరీత్యా తీరిక లేకుండా ఉండే దూదియా నాయక్  తండ్రి ద్వారా వారసత్వంగా సంక్రమించిన 2.5ఎకరాల వ్యవసాయ భూమిలో సంప్రదాయ పంటలు పత్తి, మొక్కజొన్న, వరి సాగుతో పాటు బత్తాయి, మామిడి తోటలు పెట్టాలని మొదట అనుకున్నాడు.


  అవి దిగుబడి సరిగా రావని గ్రహించి, మిత్రుడి సూచన మేరకు ఒకసారి వేస్తే ఏళ్ల తరబడి దిగుబడి వచ్చే డ్రాగన్ ఫ్రూట్స్ పంటను ఎంచుకొని సాగు చేస్తున్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం పంట వేయగా. పంట వేసిన తర్వాత తొమ్మిది నెలల నుంచి మంచి దిగుబడి వస్తుంది. పది, పదిహేను రోజులకొకసారి పంటకు తడిని పెడితే సరిపోతుందని, వర్షాకాలమైతే అవసరమే లేదని రైతు పేర్కొంటున్నాడు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తున్నట్లు చెప్పారు.


  Read this also ;  Mulugu: జానపద గేయాలు పురుడు పోసుకుంది ఎక్కడో తెలుసా..! తెలిస్తే ఆశ్చర్యపోతారు..!


  ఏటా 8 నుంచి 16 టన్నుల వరకు పంట దిగుబడి వస్తుందని, పంట సాగు దశలో ఒకసారి ఎకరాకు రూ.4 నుంచి రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఎలాంటి పెట్టుబడి లేకుండా ఏటా పంట చేతికి వస్తుందని దూదియానాయక్ చెబుతున్నారు.  Read this also ; Mulugu: ఫ్రెండ్ షిప్ పేరుతో హద్దులు దాటారు.. కానీ వాడు మాత్రం అలా చేస్తాడనుకోలేదు.


  డ్రాగన్ ఫ్రూట్స్ తోటలో అంతర్ పంటగా మొక్కజొన్నతో వివిధ రాలక పంటలను కూడా వేస్తున్నట్లు తెలిపారు. మెట్ట ప్రాంత రైతులకు ఈ పంట లాభదాయకంగా ఉంటుందని, తమ పంట క్షేత్రం వద్దనే నర్సరీని కూడా ఏర్పాటు చేసి చుట్టూ పక్కల రైతులకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను కూడా అందిస్తున్నట్లు తెలిపారు.


  డ్రాగన్ ఫ్రూట్ పంట పండించడం చాలా సంతోషంగా ఉంది అని అంటున్నా కానిస్టేబుల్, సూచనలు ఇస్తూ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్ పంట పండించడం చాలా సంతోషంగా ఉంది అని అంటున్నా కానిస్టేబుల్.

  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Medak, Medak Dist, New Agriculture Acts, Telangana

  ఉత్తమ కథలు