(K.Veeranna,News18,Medak)
శుభకార్యానికి ముందుగా బలిచ్చేది గుమ్మడికాయ (Pumpkin). గుమ్మడికాయ శుభకార్యానికి తప్పనిసరి. గతంలో గ్రామాలలో ఎక్కడపడితే అక్కడ గుమ్మడికాయ (Pumpkin)లు లభించేవి. ప్రస్తుతం పెరుగుతున్నటువంటి టెక్నాలజీతో గుమ్మడికాయ (Pumpkin) దొరకడం కరువైపోయింది. శుభకార్యానికి కావాల్సిన గుమ్మడికాయ (Pumpkin) ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఒక్కటి ఖరీదు ₹200 నుంచి 300 వరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. అలాంటి గుమ్మడి (Pumpkin)కాయ (Pumpkin) అతి తక్కువ విస్తీర్ణంలో గుమ్మడికాయ (Pumpkin) పంటను సాగు చేస్తున్న పంట సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం సంప్రదాయ పంటలను సాగు చేయడం ద్వారా అన్నదాతలకు అధిక పెట్టుబడి ఖర్చు అవుతోంది.
సిద్దిపేట జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రైతులు వాణిజ్య పంట గుమ్మడి (Pumpkin)ని సాగు చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. ముఖ్యంగా రాయపోలు మండలం ముంగిసపల్లి, రాంసాగర్, గజ్వేల్ మండలంలోని బంగ్లా వెంకటాపూర్, కొండపాక మండలంలోని బందారంలో ఎక్కువ మంది రైతులు గుమ్మడి (Pumpkin)ని సాగు చేశారు. జిల్లాలో గత మూడేళ్లుగా తక్కువ విస్తీర్ణంలో ఈ పంటను వేస్తున్నారు. వేసినవారు మాత్రం లాభాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు రైతులు. దీని సాగుకు తక్కువ పెట్టుబడి అవుతుండటంతో ఆసక్తి కనబరుస్తున్నారు. జంట నగరాల నుంచి వ్యాపారులు చేను వద్దకు వచ్చి కొనుగోలు చేసి గుమ్మడికాయలు (Pumpkin) తీసుకెళుతుంటారు.
పండుగలు, శుభకార్యాల వేళల్లో గుమ్మడి కాయ (Pumpkin)లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కానీ గుమ్మడి (Pumpkin) సాగు క్రమంగా తగ్గుతోందని అధికారులు తెలిపారు. శివ ప్రసాద్, డీఏవో, సిద్దిపేట చీడపురుగులు గుమ్మడికాయ (Pumpkin)కు ఎలాంటి వ్యాధులు సోకవని అధికారులు చెప్తున్నారు. కొందరు రైతులు గుమ్మడి పంట సాగు చేయడం ద్వారా లాభాలు పొందుతున్నారు. జిల్లాలో తక్కువ మంది రైతులు గుమ్మడికాయ (Pumpkin)లు సాగు చేస్తారు. పండుగ సమయాలకు చేతికొచ్చేలా వీటిని వేస్తున్నారు. గుమ్మడి కాయలకు చీడపీడలు తక్కువగానే ఆశిస్తాయి. వ్యాపారులు ముందస్తుగానే మాట్లాడుకొని తీసుకెళ్తుండటంతో మేలు చేకూరుతోంది.
ముంగి సత్తయ్య అనే రైతు ముంగిసపల్లి గుమ్మడిని గత 20 సంవత్సరాలుగా సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం మూడు ఎకరాల్లో గుమ్మడికాయ పంట ఉంది. ఎకరాకు సుమారు రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. రూ.45 వేల ఆదాయం లభిస్తుంది. చేను వద్దకు వచ్చి తీసుకెళుతుండటంతో రవాణా ఖర్చు మిగులుతుందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.