HOME »CAREERS & JOBS »state -government -jobs
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు

రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ విభాగాల్లోని ఖాళీల భర్తీకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉంటాయి. ఇందు కోసం ప్రత్యేక నియామక ఏజెన్సీలను ఏర్పాటు చేశాయి. తెలంగాణ, ఏపీలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లతో పాటు పలు ఉద్యోగాల భర్తీని టీఎస్పీఎస్సీ(TSPSC), ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) చేపడుతుంది. మరింత చదవండి రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ విభాగాల్లోని ఖాళీల భర్తీకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉంటాయి. ఇందు కోసం ప్రత్యేక నియామక ఏజెన్సీలను ఏర్పాటు చేశాయి. తెలంగాణ, ఏపీలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లతో పాటు పలు ఉద్యోగాల భర్తీని టీఎస్పీఎస్సీ(TSPSC), ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) చేపడుతుంది. ముఖ్యంగా గ్రూప్-2 ఉద్యోగాలు అంటే డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్టార్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్(ACTO), ఎక్సైజ్ సీఐ తదితర ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఏళ్ల పాటు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా క్రేజ్ ఉన్న ఉద్యోగాలు అంటే పోలీస్ జాబ్ లే అని చెప్పాలి. వేల సంఖ్యలో పోస్టులు ఉండడంతో ఈ ఉద్యోగాలకు పోటీ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వేలాది మంది యువత ఖాకీ చొక్క వేసుకోవాలన్న తమ కలను నెరవేర్చుకోవడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ నియామకాలను ఆయా రాష్ట్రాల పోలీస్ నియామక బోర్డులు చేపడుతాయి. తెలంగాణలో TSLPRB(Telangana State Level Police Recruitment Board), ఆంధ్రప్రదేశ్ లో APSLPRB(Andhra Pradesh State Level Police Recruitment Board) పోలీస్ నియామకాలను చేపడుతాయి. ఇంకా టీచర్ జాబ్ లకు కూడా ఇరు రాష్ట్రాల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరుగుతాయి. తెలంగాణలో గత సారి టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో టీచర్ ఉద్యోగ నియామకాలను చేపట్టారు. కరోనా అనంతరం ఇరు రాష్ట్రాల్లో వైద్య, ఆరోగ్య శాఖలో నియమకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఖాళీల భర్తీకి ఆయా జిల్లాల డీఎంహెచ్ఓ(DMHO) లు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. అయితే ఈ నియామకాలు ఎక్కువగా కాంట్రాక్ట్ విధానంలో చేపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీకి విడుదల చేసే నోటిఫికేషన్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ‘News18 Telugu’ ఎప్పటికప్పుడు అభ్యర్థులకు అందిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు