రైల్వే ఉద్యోగాలుభారతీయ రైల్వేలో ఉద్యోగం (Railway Jobs) నిరుద్యోగుల కల. ఇండియన్ రైల్వేస్ (Indian Railways) తరచూ జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉంటుంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) లాంటి నియామక సంస్థలతో పాటు వేర్వేరు రైల్వే జోన్లు ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉంటాయి. మరింత చదవండి భారతీయ రైల్వేలో ఉద్యోగం (Railway Jobs) నిరుద్యోగుల కల. ఇండియన్ రైల్వేస్ (Indian Railways) తరచూ జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉంటుంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) లాంటి నియామక సంస్థలతో పాటు వేర్వేరు రైల్వే జోన్లు ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉంటాయి. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC), లెవెల్ 1, మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ లాంటి పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్స్ వస్తుంటాయి.
ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రెయిన్స్ క్లర్క్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, గూడ్స్ గార్డ్, కమర్షియల్ అప్రెంటీస్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, స్టేషన్ మాస్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తుంది. మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్‌లో చీఫ్ లా అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్(హిందీ) లాంటి పోస్టులు ఉంటాయి.
వీటితో పాటు పారామెడికల్ విభాగాల్లో హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్, స్టాఫ్ నర్స్, ఈసీజీ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ సూపరింటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్ లాంటి పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ లాంటి కోర్సులు పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు ఎంపిక విధానం వేర్వేరుగా ఉంటుంది. నియామక ప్రక్రియలో మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైపింగ్ స్కిల్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ లాంటి దశలు ఉంటాయి. ఈ దశలన్నీ విజయవంతంగా దాటినవారిని రైల్వే ఉద్యోగం వరిస్తుంది. రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ‘News18 Telugu’ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.