ప్రైవేట్ ఉద్యోగాలునిరుద్యోగులు ఎక్కువగా ఉండడం.. ప్రభుత్వ ఉద్యోగాలు అందుకు సరిపడా ఉండకపోవడంతో యువత ప్రైవేటు ఉద్యోగాల (Private Jobs) వైపు ఆసక్తి చూపుతున్నారు. అనేక ప్రైవేటు సంస్థలు ఉద్యోగులకు మంచి జీతాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు లక్షల్లో జీతాలు (Corporate Jobs) ఆఫర్ చేస్తున్నాయి. మరింత చదవండి నిరుద్యోగులు ఎక్కువగా ఉండడం.. ప్రభుత్వ ఉద్యోగాలు అందుకు సరిపడా ఉండకపోవడంతో యువత ప్రైవేటు ఉద్యోగాల (Private Jobs) వైపు ఆసక్తి చూపుతున్నారు. అనేక ప్రైవేటు సంస్థలు ఉద్యోగులకు మంచి జీతాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు లక్షల్లో జీతాలు (Corporate Jobs) ఆఫర్ చేస్తున్నాయి. దీంతో యువత ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడానికి పోటీలు పడుతున్నారు. ఇంకా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిరుద్యోగులకు శిక్షణ అందించి వారికి స్థానిక కంపెనీల్లో ఉద్యోగాలు లభించేలా చొరవ తీసుకుంటున్నాయి.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం టాస్క్ (TASK-Telangana Academy for Skill and Knowledge), ఏపీ ప్రభుత్వం ఏపీఎస్ఎస్డీసీ (APSSDC - Andhra Pradesh State Skill Development Corporation) ఏర్పాటు చేశాయి. ఈ సంస్థల ద్వారా ఉద్యోగ నియామకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సంస్థలు వివిధ ప్రాంతాల్లో అనేక జాబ్ మేళాలు సైతం నిర్వహిస్తూ వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. నిరుద్యోగుల దగ్గర నుంచి అప్లికేషన్లను స్వీకరించి వారికి శిక్షణ అందిస్తున్నాయి. తద్వారా వారికి ఉపాధి లభించేలా ప్రోత్సహిస్తున్నాయి.
ఈ సంస్థల నుంచి నిరుద్యోగుల కోసం విడుదలయ్యే ప్రకటనలకు సంబంధించిన పూర్తి వివరాలను ‘New18Telugu’ ఎప్పటికప్పుడూ అందిస్తూ ఉంటుంది. వీటితో పాటు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలతో పాటు స్థానికంగా ఉండే చిన్న చిన్న కంపెనీలు, సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రచురిస్తూ ఉంటుంది. Ph.D చేసిన వారి నుంచి మొదలుకుని టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ తదితర విద్యార్హతలు కలిగిన వారి కోసం ప్రైవేటు కంపెనీలు విడుదల చేసే ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నిరుద్యోగులకు చేరవేయడంలో ‘News18Telugu’ ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటుంది.