కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... విద్యావంతుల కల. బాగా చదువుకొని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ (Central Government Job) సంపాదించాలని కలలు కనేవారి కోసం వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లాంటి నియామక సంస్థలు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ ఉంటాయి. మరింత చదవండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... విద్యావంతుల కల. బాగా చదువుకొని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ (Central Government Job) సంపాదించాలని కలలు కనేవారి కోసం వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లాంటి నియామక సంస్థలు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ ఉంటాయి. ప్రతీ ఏటా వేల సంఖ్యలో పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను (Job Calendar) ముందుగానే విడుదల చేస్తాయి ఈ సంస్థలు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, జియో సైంటిస్ట్, సీఐఎస్ఎఫ్, ఎన్‌డీఏ, సీడీఎస్, ఐఈఎస్, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ లాంటి నోటిఫికేషన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఇక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (CHSL), కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (CGL), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), జూనియర్ ఇంజనీర్ (JE), స్టెనోగ్రాఫర్, జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ (GD Constable) లాంటి నోటిఫికేషన్స్ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తుంది.
ఈ పోస్టులకు టెన్త్, ఇంటర్, డిగ్రీతో పాటు ఇతర ప్రొఫెషనల్ కోర్సులు పాస్ అయినవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. నోటిఫికేషన్‌ను బట్టి ఎంపిక విధానం వేర్వేరుగా ఉంటుంది. కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ కూడా ఉండదు. ప్రిలిమ్స్, మెయిన్స్ పాస్ అయితే చాలు. కొన్ని పోస్టులకు మాత్రం ప్రిలిమ్స్, మెయిన్స్‌తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్స్, ప్రిపరేషన్ టిప్స్ కోసం ‘News18 Telugu’ వెబ్‌సైట్ ఫాలో అవండి.