HOME »CAREERS & JOBS »bank -jobs
బ్యాంక్ ఉద్యోగాలు
బ్యాంక్ ఉద్యోగాలు

భారతదేశంలో బ్యాంకు ఉద్యోగాలకు (Bank Jobs) మంచి డిమాండ్ ఉంటుంది. ఇంటర్ చదువుతున్నప్పటి నుంచే బ్యాంకు ఉద్యోగాలకు (Bank Coaching) కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. డిగ్రీ పాస్ కాగానే బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కు (Banking Exams) సీరియస్‌గా ప్రిపేర్ అవుతుంటారు. మరింత చదవండి భారతదేశంలో బ్యాంకు ఉద్యోగాలకు (Bank Jobs) మంచి డిమాండ్ ఉంటుంది. ఇంటర్ చదువుతున్నప్పటి నుంచే బ్యాంకు ఉద్యోగాలకు (Bank Coaching) కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. డిగ్రీ పాస్ కాగానే బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కు (Banking Exams) సీరియస్‌గా ప్రిపేర్ అవుతుంటారు. ప్రభుత్వ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, కో-ఆపరేటీవ్ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా అనేక ఉద్యోగాలు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి ప్రైవేట్ బ్యాంకులు కూడా రెగ్యులర్‌గా ఖాళీలను భర్తీ చేస్తూ ఉంటుంది. టెన్త్, ఇంటర్ పాస్ అయిన వారికి క్లర్క్, బ్యాంక్ అసిస్టెంట్, క్యాషియర్ లాంటి ఉద్యోగాలు ఉంటాయి. డిగ్రీ పాస్ అయినవారికి ప్రొబెషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) ఉద్యోగాలతో పాటు ఫైనాన్స్ ఆఫీసర్, లా ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, కన్సల్టెంట్ లాంటి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఉంటాయి. ఇక అనుభవజ్ఞులకు మేనేజర్ స్థాయి పోస్టులు ఉంటాయి. చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ లాంటి పోస్టులకు నోటిఫికేషన్స్ విడుదలవుతూ ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రత్యేక నోటిఫికేషన్ల ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్, ఎస్‌బీఐ క్లరికల్, ఎస్‌బీఐ ప్రొబెషనరీ ఆఫీసర్, ఎస్‌బీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్స్ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). ఇక ఇతర ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) వేర్వేరు నోటిఫికేషన్స్ జారీ చేస్తుంది. ఐబీపీఎస్ క్లరికల్, ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్, ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ లాంటి నోటిఫికేషన్ల ద్వారా ఖాళీల భర్తీ జరుగుతుంది. బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ అప్‌డేట్స్‌ని ‘News18 Telugu’ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

బ్యాంక్ ఉద్యోగాలు