1. రియల్‌మీ ఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ ఎక్స్2 ప్రో ఇండియాలో రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొద్ది రోజుల క్రితమే చైనాలో రిలీజైంది. దీంతో స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ గురించి అందరికీ తెలుసు. (image: Realme)
2. స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్, 50w SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64 మెగాపిక్సెల్ కెమెరా, సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే లాంటి ప్రత్యేకతలు ఉండటంతో ఈ ఫోన్‌పై ఆసక్తి పెరిగింది. ధర ఎంత ఉంటుందా అని యూజర్లు ఆసక్తిగా ఎదురుచూశారు. మొత్తానికి ఇండియాలో రియల్‌మీ ఎక్స్2 ప్రో గ్రాండ్‌గా రిలీజైంది. (image: Realme)
3. రియల్‌మీ ఎక్స్2 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండటం విశేషం. (image: Realme)
4. రియల్‌మీ ఎక్స్2 ప్రో 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ రిలీజైంది. (image: Realme)
5. రియల్‌మీ ఎక్స్2 ప్రో స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Realme)
6. రియల్‌మీ ఎక్స్2 ప్రో రియర్ కెమెరాలో 64+13+8 మెగాపిక్సెల్+మ్యాక్రో లెన్స్ ఉంటుంది. (image: Realme)
7. రియల్‌మీ ఎక్స్2 ప్రో ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. (image: Realme)
8. రియల్‌మీ ఎక్స్2 ప్రో బ్యాటరీ 4,000 ఎంఏహెచ్. 50w SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: Realme)
9. రియల్‌మీ ఎక్స్2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను 100% ఛార్జింగ్ 33 నిమిషాల్లో చేయొచ్చు. (image: Realme)
10. రియల్‌మీ ఎక్స్2 ప్రో నెప్‌ట్యూన్ బ్లూ, లూనార్ వైట్ కలర్స్‌లో రిలీజైంది. (image: Realme)
11. రియల్‌మీ ఎక్స్2 ప్రో రెడ్ బ్రిక్, కాంక్రీట్ కలర్స్‌లో మాస్టర్ ఎడిషన్ కూడా రిలీజైంది. (image: Realme)
12. రియల్‌మీ ఎక్స్2 ప్రో 8జీబీ+128జీబీ ధర రూ.29,999 కాగా, 12జీబీ+256జీబీ ధర రూ.33,999. (image: Realme)
13. రియల్‌మీ ఎక్స్2 ప్రో మాస్టర్ ఎడిషన్ 12జీబీ+256జీబీ ధర రూ.34,999. (image: Realme)
14. నవంబర్ 26 మధ్యాహ్నం 12 గంటల నుంది నవంబర్ 27 అర్థరాత్రి వరకు సేల్ ఉంటుంది. (image: Realme)