•  1. క్రికెట్ టోర్నమెంట్‌లో ప్రతీ మ్యాచ్ లైవ్ చూసే అవకాశం లభించదు. మరీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ప్రతీ మ్యాచ్ ఫాలో అవుతారు కానీ... మిగతావాళ్లు మాత్రం స్కోర్ అప్‌డేట్స్, హైలైట్స్‌తో సర్దుకుపోతుంటారు. అలాంటివారికోసమే మ్యాచ్ అప్‌డేట్స్ అందించేందుకు అనేక యాప్స్ ఉన్నాయి. (image: Reuters)
  •  1. క్రికెట్ టోర్నమెంట్‌లో ప్రతీ మ్యాచ్ లైవ్ చూసే అవకాశం లభించదు. మరీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ప్రతీ మ్యాచ్ ఫాలో అవుతారు కానీ... మిగతావాళ్లు మాత్రం స్కోర్ అప్‌డేట్స్, హైలైట్స్‌తో సర్దుకుపోతుంటారు. అలాంటివారికోసమే మ్యాచ్ అప్‌డేట్స్ అందించేందుకు అనేక యాప్స్ ఉన్నాయి. (image: Reuters)
  •  3. Cricbuzz: భారతదేశంలోని పాపులర్ క్రికెట్ యాప్స్‌లో ఇది ఒకటి. ఇందులో లైవ్ స్కోర్ అప్‌డేట్స్, బాల్-బై-బాల్ కామెంటరీ, హర్షా భోగ్లేతో పాటు ఇతర క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ విశ్లేషణ, లైవ్ నోటిఫికేషన్, స్కోర్ విడ్జెట్స్ లాంటివి పొందొచ్చు. హర్షా భోగ్లే ఇన్ డెప్త్ అనాలిసిస్, వీడియోస్, ఆర్టికల్స్ ఎక్స్‌క్లూజీవ్‌గా పొందొచ్చు. వీడియో హైలైట్స్‌తో పాటు ఫోటో గ్యాలరీస్ కూడా ఉంటాయి. డార్క్ థీమ్‌తో ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది ఈ యాప్. (image: Cricbuzz )
  •  4. Cricket Line Guru: ఎక్కువ రేటింగ్ ఉన్న యాప్ ఇది. లైవ్ అప్‌డేట్స్ వేగంగా లభిస్తాయి. మిగతా యాప్స్‌లో ఉన్న ఫీచర్స్ ఇందులో ఉన్నా అప్‌డేట్స్ విషయంలో వేగం ఎక్కువ. అలర్ట్స్, బాల్-బై-బాల్ కామెంటరీ, నోటిఫికేషన్స్, స్కోర్‌కార్డ్, షెడ్యూల్, మ్యాచ్ హైలైట్స్ చూడొచ్చు. ప్రతీ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు. బాల్-బై-బాల్ అప్‌డేట్ కావాలంటే ఈ యాప్ ట్రై చేయొచ్చు. Cricket Line Guru యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో లభిస్తుంది. (image: Cricket Line Guru)
  •  5. CricketNext: ఈ యాప్‌లో క్రికెట్ ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయి. ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన మ్యాచ్ అప్‌డేట్స్, స్కోర్‌కార్డ్స్‌తో పాటు లేటెస్ట్ న్యూస్, ఫోటోస్, వీడియోస్ బ్రౌజ్ చేయొచ్చు. పిచ్ రిపోర్ట్ దగ్గర్నుంచి ప్రతీ టీమ్ SWOT అనాలిసిస్ కూడా ఉంటుంది. ఇంటరాక్టీవ్ గ్రాఫిక్స్‌తో సమస్త సమాచారం లభిస్తుంది. అయాజ్ మీమన్, ప్రేమ్ పానికర్, బ్రియాన్ లారా అనాలిసిస్ చూడొచ్చు. CricketNext యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో ఉంది. (image: CricketNext)
  •  6. ESPNCricinfo: ఈ యాప్ అందించే క్రికెట్ అలర్ట్స్‌, నోటిఫికేషన్స్‌ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. టోర్నమెంట్‌కు సంబంధించిన ప్రతీ అప్‌డేట్ తెలుసుకోవచ్చు. లేదా మీ ఫేవరెట్ టీమ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ మాత్రమే తెలుసుకోవచ్చు. స్కోర్స్, అప్‌డేట్స్‌తో పాటు ఇన్-డెప్త్, పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్, హైలైట్స్ ఉంటాయి. ESPNCricinfo యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. (image: ESPNCricinfo)
Skip the ad in seconds
SKIP AD