రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పోలిస్తే కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మంచి జోష్‌లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన లాస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయినా ‘సూపర్ ఓవర్’దాకా తీసుకురావడం కోల్‌కత్తా ప్లేయర్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపే అంశం.
సునీల్ నరైన్ గాయం నుంచి కోలుకుని, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో బరిలో దిగుతున్నాడు. విరాట్ టీమ్‌పై నరైన్‌కు మంచి రికార్డు ఉండడం కోల్‌కత్తాకు కలిసొచ్చే అంశం.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదుచేసిన రికార్డు బెంగళూరు జట్టుకు ఉంది. ఆ చెత్త రికార్డు కోల్‌కత్తా మీదే సాధించింది విరాట్ టీమ్. విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ కూడా ఆ మ్యాచ్‌లో డబుల్ డిజిట్ చేరుకోలేకపోవడం విశేషం.
బెంగళూరు జట్టుపై బౌల్‌తోనే కాకుండా బ్యాటుతోనూ సత్తా చాటాడు సునీల్ నరైన్. గత సీజన్‌లో అద్భుత హాఫ్ సెంచరీతో ఆర్‌సీబీ బౌలర్లను చీల్చి చెండాడాడు నరైన్.
కెకెఆర్ vs ఆర్‌సీబీ మ్యాచ్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీల మధ్య జరిగిన గొడవే. ఈ సీజన్‌కు ముందే గంభీర్... కోహ్లీని ఉద్దేశించి ‘బెంగళూరు జట్టుకు అతను రుణపడి ఉన్నాడు. టైటిల్ గెలవలేకపోయినా అతన్నే కెప్టెన్‌గా కొనసాగిస్తోంది ఆర్‌సీబీ’ అంటూ వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలంటే కోహ్లీ చెలరేగిపోవాల్సిందే.
ప్రస్తుత సీజన్‌లో కోల్‌కత్తా ఎక్కువగా ఆధారపడిన క్రికెటర్ ఆండ్రే రస్సెల్. బ్యాట్స్‌మెన్‌గా ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న రస్సెల్... బౌలర్‌గానూ కీలక వికెట్లు తీస్తూ కోల్‌కత్తా విజయంలో కీ రోల్ పోషిస్తున్నాడు.
సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ వరల్డ్ నెం.1 బ్యాట్స్‌మెన్‌గా ఉన్న ‘రన్ మెషీన్’ విరాట్ కోహ్లీ... ఐపీఎల్‌లో పెద్దగా పరుగులేమీ చేయలేకపోయాడు. కోహ్లీ ఫ్యాన్స్ ఆయన నుంచి అద్భుత ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు.