గత సీజన్‌లో ఘోరంగా విఫలమైన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు... ఈ సీజన్‌లో అదరగొడుతుందని ఫ్యాన్స్ భావించారు. జట్టులో ఎన్నో మార్పులు కూడా జరగడంతో ‘ఈ సాల కప్ నమ్‌దే’ అంటూ ఆర్‌సీబీ ఫ్యాన్స్ తెగ హడావుడి చేశారు.
అయితే మొదటి మ్యాచ్‌లోనే ఘోరంగా ఫెయిల్ అయిన కోహ్లీ టీమ్... 70 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ కోహ్లీతో పాటు ఏబీ డివిల్లియర్స్ కూడా స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు.
భారత టీమ్ ఓడిపోయినప్పుడు కూడా బ్యాట్‌తో రాణించేవాడు కింగ్ కోహ్లీ. ఐపీఎల్‌లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. బెంగళూరు కెప్టెన్ నాలుగు మ్యాచుల్లో కలిపి కేవలం 78 పరుగులే చేశాడు.
అందులో ముంబై ఇండియన్స్‌పైన చేసినవే 46 పరుగులు. మిగిలిన మ్యాచుల్లో డబుల్ డిజిట్ చేరుకోవడానికి కూడా కష్టపడుతున్నాడు కోహ్లీ.
ఇద్దరూ స్టార్స్ ఒకే చోట ఉండడం కూడా ఐపీఎల్‌లో బెంగళూరు ఓటమికి ప్రధాన కారణం. ఇద్దరి మధ్య సమన్వయం లోపించడంతో పాటు ప్రత్యర్థి బౌలర్లు వీరిని అవుట్ చేసేందుకు భారీగా ప్రణాళికలు రూపొందిస్తూ బరిలో దిగుతున్నారు.
గత సీజన్‌లో బెంగళూరు జట్టు ఓడిపోయినప్పటికీ విరాట్ కోహ్లీ ఆత్మస్థైర్యం ఏమాత్రం దెబ్బతినలేదు. ఐపీఎల్ ఓటమిని లైట్‌గా తీసుకున్నాడు విరాట్. అయితే ఈ సారి జట్టు వైఫల్యం అతన్ని మానసికంగా దెబ్బతీస్తోంది.
హైదరాబాద్‌తో మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయిపోవడం చూసి సగటు భారత క్రికెట్ అభిమాని ఆవేదనకు గురవుతున్నాడు. వరల్డ్‌కప్ ముందు బెంగళూరు ఫెయిల్యూరు సారథి ఆత్మవిశ్వాసంపై దెబ్బతీసే అవకాశం లేకపోలేదు.
గత సీజన్‌లో బెంగళూరుకు ఆడిన కెఎల్ రాహుల్... ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ఆడుతూ బాగానే పరుగులు చేస్తున్నాడు. ఆ టీమ్‌లో ‘కోహ్లీ, ఏబీడీ షాడో కింద ఉన్నా... ఇప్పుడు నేనే నేనుగా ఆడుతున్నా’ అని రాహుల్ చేసిన కామెంట్స్ బెంగళూరు టీమ్‌లో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
హెట్మయర్, శివమ్ దుబే, కోలిన్ డే గ్రాండ్‌హోమ్ వంటి భారీ హిట్టర్లు కూడా బెంగళూరు జట్టును విజయతీరాలకు చేర్చడంలో విఫలమవుతున్నారు.
ఓపెనర్ పార్థివ్ పటేల్ ఒక్కడే మొదటి నుంచి కాస్తో కూస్తో రాణిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో పార్థివ్ 28 పరుగులు చేయకపోతే ఆర్‌సీబీ మరింత స్వల్ప స్కోరుకే పరిమితమయ్యేది.
గత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన మొయిన్ ఆలీ... ఈ సీజన్‌లో అంచనాలు అందుకోలేకపోతున్నాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ కూడా మొయిన్‌పై పడుతోంది.
భారత ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న చాహాల్ ఒక్కడే బెంగళూరు జట్టులో స్థాయికి తగిన ప్రదర్శన ఇస్తున్నాడు. ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పర్పుల్ క్యాప్ అందుకున్నాడు చాహాల్.
వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... జట్టులో చాలా మార్పులు చేయాలని భావిస్తోంది. కింగ్ కోహ్లీ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు కూడా. అయితే టీమ్‌లో మార్పుల కంటే టీమ్‌ను నడిపించడంలో కోహ్లీ అనుసరిస్తున్న విధానం మారాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాడు.