పూజా జైన్. ఈమె 'డిజిట్స్ N డెస్టిని' వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్. మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఈమెకు విద్యావేత్తగానూ 15 ఏళ్ల అనుభవం ఉంది. ప్రముఖ న్యూమరాలజిస్ట్, న్యూమరాలజీ ట్రైనర్, మాస్టర్ టారో రీడర్గా నవజాత శిశువుల నామకరణం కోసం ఉద్దేశించిన 'ది డిజిట్స్ ఎన్ డెస్టినీ షో' అనే ప్రఖ్యాత షోతో పాటు ఎన్నో ఛానెళ్లలో విజయంతమైన షోలను నిర్వహించారు. యూత్ ఐకాన్ అవార్డు, బెస్ట్ న్యూమరాలజిస్ట్, ఉత్తమ నవజాత శిశువు పేర్ల నిపుణులు వంటి అనేక ప్రశంసలను పూజా జైన్ అందుకున్నారు. న్యూమరాలజీ, టారో రీడింగ్ అంచనాల ద్వారా వ్యక్తిత్వాన్ని విశ్లేషించడంలో ఆమె ఎంతో పేరు సంపాదించారు. అంతేకాదు ఆమె గత 15 సంవత్సరాలుగా ధ్యాన రంగంలో ఉన్నారు. పూజా జైన్ సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్, టారో కౌన్సెలర్ మాత్రమే కాదు. 'డిజిట్స్ N డెస్టినీ'లో ట్రైనర్ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు. ఒక పర్సనాలిటీ రీడర్గా ఆమె వైద్యం, రాజకీయాలు, ఫ్యాషన్ పరిశ్రమ, చలనచిత్ర పరిశ్రమ, ప్రచురణ వంటి అనేక ఇతర రంగాలలో నిపుణులను తయారు చేశారు. వ్యక్తిత్వ లక్షణ విశ్లేషణను అందించడంతో పాటు టారో కార్డ్ ద్వారా సంప్రదింపులు జరిపే వ్యక్తులకు సాయం చేస్తారు. వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. ప్రస్తుతం ఈ రంగంలో ఎంతో పేరున్న అనేక మంది టారో రీడర్లు, న్యూమరాలజీ నిపుణులను 'డిజిట్స్ N డెస్టిని తయారు చేసింది. #Digits N Destini 9052647890,8297514567