ప్రస్తుత రోజుల్లో అక్రమ సంబంధాలు ఎక్కువయ్యాయి. వావి వరస, చిన్నా పెద్ద మరిచి ఎఫైర్లు నడిపిస్తున్నారు. ఇక పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న వారు కూడా మరొకరిని ఇష్టపడుతున్నారు. ఇంకొందరైతే వారితో కలిసి పారిపోతున్నారు తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మరికాసేపట్లో పెళ్లి అనగా..ఆ పెళ్లికూతురు పారిపోయింది. అది కూడా తన అక్క మొగునితో కావడం గమనార్హం.
Minister Gangula Kamalakar: తెలంగాణ సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలకు మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారన్నారు.
ఇంటెలిజెన్స్ సీఐ వేధింపులు భరించలేక ఓ వ్యక్తి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. భూమి విషయంలో సీఐ బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక శంభయ్య అనే వ్యక్తి నడి ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ లెటర్ ఇప్పుడు కలకలం రేపుతోంది. శంభయ్య మృతితో ఆ కుటుంబంలో విషాధచాయలు అలముకున్నాయి. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ ఫలితాల వివాదం ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. 2018 ఎన్నికల ఫలితాల ప్రకటనలో అవకతవకలు జరిగాయని కొప్పుల ఈశ్వర్ ఎన్నిక అక్రమమని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను తెరిచే క్రమంలో తాళం లేదంటూ అధికారులు చేతులు ఎత్తేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పదవ తరగతి హిందీ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో A1 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఒకవేళ నేరం రుజువైతే బండి సంజయ్ పై పెట్టిన కేసుల్లో నిజం ఉందని తేలితే ఆయనకు సుమారు మూడు నుండి ఏడు సంవత్సరాల పాటు జైలుశిక్ష పడే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాదులు అంటున్నారు.
Bandi Sanjay: టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు జైలు నుంచి బండి సంజయ్ సందేశం ఇచ్చారు.
TSPSC Paper Leak: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిట్ అధికారులు కాలు మోపారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కీలక ఆధారాలపై కూపీ లాగేందుకు రంగప్రవేశం చేశారు.
Komireddy Ramulu Passes Away: తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య కారణాలతో మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కన్నుమూశారు. గత కొంతకాలంగా కొమిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు.
Special Story: అదీ నైట్ కాలేజి కాదు. కాని రాత్రుల్లు కూడా అక్కడ చదువులు సాగుతున్నాయి. రోజంతా నడిచే ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూట్ కూడా కాదు. కానీ పుస్తకాలతో నిత్యం అక్కడ బిజిబిజిగా గడుపుతారు. కరీంనగర్ లో రేయింబవళ్లు చదువుకునే ఈ గ్రంథాలయంపై న్యూస్ 18 తెలుగు స్పెషల్ స్టోరీ మీకోసం.. (P.Srinivas,New18,Karimnagar)
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా తెలంగాణతల్లి విగ్రహం వద్ద BRS నాయకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏం జరిగిందంటే?
Flexi War: నిన్న నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో ఫ్లెక్సీలు వెలవగా..ఒక్కరోజు వ్యవధిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు, ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా జగిత్యాలలోని మెట్ పల్లి ప్రధాన కూడళ్లపై పోస్టర్లు వెలవడం కలకలం రేపుతోంది. (P.Srinivas,New18,Karimnagar)
అనుమానం పెను భూతమైంది. తాగిన మత్తులో కట్టుకున్న భార్యను భర్తే అత్యంత కిరాతకంగా కత్తిపీటతో నరికి చంపాడు. తల్లి చనిపోయి, తండ్రి జైలుకు వెళ్లడంతో ముక్కుపచ్చ లారని ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. క్షణికావేశంలో చేసిన దాడితో ఆ ప్రబుద్దుడు కటకటాల పాలయ్యాడు. పోలీసులు, గ్రామస్తుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
చైతన్యవంతమైన జిల్లాల్లో ఒకటిగా పేరు గాంచిన జగిత్యాల జిల్లా తరుచూ హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం అయిందంటే చాలు..ఏదో ఒక విచిత్రమైన పిటిషన్ అధికారులకు ఇస్తుంటారు ఇక్కడి వారు. వినే వారికి సిల్లీగానే ఉన్నప్పటికీ మా బాధలు కూడా పట్టించుకోండని ఇచ్చే దరఖాస్తులు మాత్రం సాధారణంగా మారిపోతున్నాయక్కడ. దీనితో ప్రజావాణి కార్యక్రమంలో ఆ జిల్లా అధికారులు వింత అనుభవాలు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ నుండి సామాన్య ఉద్యోగి వరకు అక్కడికి వస్తున్న వినతి పత్రాలు చూసి పరేషాన్ అవుతున్నారు. అత్యంత విచిత్రంగా వస్తున్న ఆ ఫిర్యాదుల గురించి తరుచూ చర్చల్లోకి వస్తోంది జగిత్యాల జిల్లా. తాజాగా నిన్న సోమవారం జరిగిన ప్రజావాణికి ఓ మహిళ కత్తితో వచ్చింది. ఎందుకంటే?