
తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న చక్కని టూరిజం స్పాట్ పాపికొండలు. అటు తెలంగాణకు ఇటు ఆంధ్రప్రదేశ్ కు మధ్యలో ఉన్న పాపికొండల యాత్రకు వచ్చేందుకు చాలా మంది ఉత్సాహపడుతుంది.
ఐతే కచ్చులూరులో జరిగిన ప్రమాదం వల్ల ఏడాదిన్నరపాటు పాపికొండల యాత్ర నిలిచిపోయింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాపికొండలు యాత్రను పునఃప్రారంభించింది. ప్రత్యేక ప్యాకేజీల ద్వారా పర్యాటకులను ఆకర్షిస్తోంది.
పాపికొండల యాత్రలో గోదావరి నది అందాలతో పాటు పట్టిసీమ, పోలవరం, గండిపోచమ్మ ఆలయం, భద్రాచలం, మారేడుమిల్లి, దేవీపట్నం వంటి పర్యాటక ప్రాంతాలు దర్శనమిస్తాయి.
ఏడాదిన్నర తర్వాత పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం సింగనపల్లి (కంపెనీ) వద్ద నుంచి బోట్లను నడుపుతున్నారు.
పాపికొండలు టూర్ కోసం పర్యాటక శాఖ పలు ప్యాకేజీలు అమలు చేస్తోంది. ఇందులో ఒకరోజు, రెండు రోజులకు ప్రత్యేకమైన ప్యాకేజీలున్నాయి. ఈ టూర్ ను ముందుగా ఆన్ లైన్లో www.papikondalu.in వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఉదయం 7.30 గంటల సమయంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి రోడ్డు మార్గాన పురోషోత్తపట్నం, పట్టిసీమ, పోలవరం తీరానికి తీసుకెళ్తారు.
అక్కడి నుంచి బోట్ల ద్వారా దేవీపట్నం, పేరంటాళ్లపల్లి, పాపికొండలు, భద్రాచలం వంటి ప్రాంతాలకు తీసుకెళ్తారు. రెండు రోజుల టూర్ కు ఎంపిక చేసిన చోట నైట్ స్టే కల్పిస్తారు. టూర్ పూర్తైన తర్వాత మళ్లీ రాజమండ్రిలోనే డ్రాప్ చేస్తారు.
పాపికొండలు అందాలు
ఆకట్టుకుంటున్న పాపికొండలు అందాలు
ఆకట్టుకుంటున్న పాపికొండలు అందాలు
ఆకట్టుకుంటున్న పాపికొండలు అందాలు
ఆకట్టుకుంటున్న పాపికొండలు అందాలు