News18 Telugu | April 28, 2021, 23:15 IST

Anushka Shetty Marriage: అనుష్క శెట్టి పెళ్లి ఖరారైందా.. తనకంటే వయసులో చిన్నవాడితో ఏడడుగులు..?

Anushka Shetty Marriage: తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ బోర్ కొట్ట‌ని టాపిక్ అనుష్క పెళ్లి(Anushka Shetty Marriage). ఈమె మ్యారేజ్ గురించి చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తనకంటే వయసులో చిన్నవాడితో అనుష్క ఏడడుగులు నడవబోతుందనే ప్రచారం జరుగుతుంది.

1/ 7

తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ బోర్ కొట్ట‌ని టాపిక్ అనుష్క పెళ్లి. ఈమె మ్యారేజ్ గురించి చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ స‌రైన సమాధానం మాత్రం రావ‌డం లేదు. ఈ భామ పెళ్లి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు వ‌స్తున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్ఫ్యూజ‌న్ త‌ప్ప క్లారిటీ రాలేదు.

2/ 7

ఇప్పటికే ఈ భామ వయసు 40కి చేరువైంది. రోజు రోజుకి రూమ‌ర్లు ఎక్కువైపోతుంటే అనుష్క పెళ్లిపై రోజుకో వార్త బ‌య‌టికి వ‌స్తుంటే అభిమానుల్లో కూడా కంగారు పెరిగిపోతుంది. ఇంత‌కీ ఈ భామ ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి.

3/ 7

పైగా ప్ర‌భాస్‌తో కొన్నాళ్లుగా అనుష్క డేటింగ్ చేస్తుంద‌నే వార్త‌లు కూడా ఉన్నాయి. దీనిపై అటు ప్ర‌భాస్.. ఇటు అనుష్క నో అనే స‌మాధానాలే చెప్పారు. అయినా కూడా వీళ్ల మ‌ధ్య రూమ‌ర్స్ ఆగ‌డం లేదు. ఇప్పుడు వీట‌న్నింటికీ స‌మాధానాలు వ‌స్తున్నాయి.

4/ 7

కాక‌పోతే కాస్త మెల్ల‌గా వ‌స్తున్నాయంతే.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని బ‌ట్టి చూస్తుంటే అనుష్క పెళ్లి ఇప్ప‌ట్లో లేన‌ట్లే అని తెలుస్తుంది. ప్ర‌స్తుతం జేజ‌మ్మ మ‌న‌సు అంతా సినిమాల‌పైనే ఉంది. గతేడాది ఈమె నటించిన ‘నిశ్శబ్ధం’ సినిమా నేరుగా ఓటిటిలో విడుదలైంది.

5/ 7

ఈ సినిమా ఫ్లాప్ కావడంతో బ్రేక్ తీసుకుంది అనుష్క. నిశ్శబ్ధం తర్వాత సినిమాలు ఒప్పుకోవడం లేదు అనుష్క. అలాగని పెళ్లి ఊసు కూడా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే త‌న పెళ్లి ఇప్ప‌ట్లో ఉండ‌ద‌ని మ‌రోసారి క్లారిటీ ఇచ్చింది అనుష్క‌.

6/ 7

అయితే ఇప్పుడు మాత్రం అనుష్క పెళ్ళిపై మరో వార్త బయటికి వచ్చింది. ఓ దుబాయ్ వ్యాపారవేత్త కొడుకుతో అనుష్క శెట్టి పెళ్లి సెట్ అయిందని.. ఆ కుర్రాడు అనుష్క కంటే వయసులో చిన్నవాడు అని ప్రచారం జరుగుతుంది. దీనిపై పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది.

7/ 7

ఇది మాత్రం పక్కా అని.. ఈ సారి అనుష్క పెళ్లి పీటలెక్కడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై జేజమ్మ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రారా కృష్ణయ్య ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి హీరోగా ఓ సినిమా చేయబోతుంది. యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనుంది.

Published by:Praveen Kumar Vadla
First published:April 28, 2021, 23:15 IST
తదుపరి గ్యాలరీ