సినిమా ఇండస్ట్రీలో వరుసగా షాకింగ్ వార్తలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే నందమూరి తారక రత్న తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఆయన ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అందాల భామ ఇలియానా ఆస్పత్రి పాలైన వార్త కలకలం రేపుతోంది.
గత మూడు రోజులుగా ఇలియానా తీవ్ర అస్వస్థతకు గురయ్యిందని తెలుస్తోంది. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆమె పంచుకుంది.
ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న ఆమెకు వైద్యులు మూడు సైలెన్స్ బాటిల్స్ పెట్టినట్లు తెలిపింది. కనీసం ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది.
అయితే ఇలియానాకు ఏమైంది ఆమెకు వచ్చిన హెల్త్ ప్రాబ్లం ఏంటి ? ఆమెకు ఏమైంది అన్న విషయాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఆమెకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటనేది ఇప్పటివరకు సమచారాం లేదు.
ఇక ఇలియానా విషయానికి వస్తే.. ఇలియానా డిక్రూజ్ 2006లో 'దేవదాసు'తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. 2012 లో 'బర్ఫీ' చిత్రంతో బాలీవుడ్ లో కి అడుగుపెట్టింది.
దేవదాసు మంచి విజయం అందుకోవడంతో ఆ తర్వాత మహేష్, పూరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’లో నటించి ఒకే సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారింది. పోకిరి సినిమా హిట్టు కొట్టడంతో కుర్రాల మదిలో ఇలియానా చెరగని ముద్ర వేసుకుంది, (Image Credit : Instagram)
ఇలియానా తన 10వ ఏట నట జీవితాన్ని ప్రారంభించింది. బాలీవుడ్‌కి రాకముందు తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. సినిమాలే కాకుండా, నటి తన వ్యక్తిగత జీవితంలో విభిన్న డిజైనర్ రింగ్‌లను సేకరించడానికి ఇష్టపడుతుంది. ఆమె దగ్గర వద్ద 300 కంటే ఎక్కువ విభిన్న డిజైనర్ రింగ్ లు ఉన్నాయి.