News18 Telugu | October 03, 2021, 22:57 IST

Suma-Rajeev Kanakala: రాజీవ్ కనకాలపై సుమ సంచలన వ్యాఖ్యలు.. నా భర్త అలాంటి వాడే అంటూ..

Suma-Rajeev Kanakala: రాజీవ్‌ కనకాలపై యాంకర్‌ సుమ కీలక వ్యాఖ్యలు చేసింది. తన భర్త నటనపై సోషల్ మీడియాలో ప్రశంశలు కురిపించింది. లవ్‌ స్టోరీ సినిమాలో రాజీవ్ క‌న‌కాల‌ ప్రేక్షకులు అసహ్యించుకునే పాత్రలో నటించాడు. సాధారణంగా అలాంటి పాత్ర చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ రాజీవ్ కనకాల మాత్రం దర్శకుడు శేఖర్ కమ్ములను నమ్మి ముందడుగు వేశాడు.

1/ 8

తన మాటలతో బుల్లితెరని ఏలుతుంది యాంకర్ సుమ. ఆమె గురించి టాలీవుడ్ లో తెలివారు ఉండరేమో.. ముఖ్యంగా బుల్లితెరపై ఈమె మహారాణి.. ఒక్కముక్కలో చెప్పాలంటే మకుటం లేని మహారాణిగా స్మాల్ స్క్రీన్‌పై చక్రం తిప్పేస్తుంది సుమ. ఇంకో వైపు సినిమా ఈవెంట్స్ ని కూడా అదరగొడుతోంది. కెరీర్ మొదట్లో సినిమాల్లో నటించినా కూడా ఆ తర్వాత అది తనకు సూట్ అవ్వదు అని.. దారి మార్చుకుని బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ సుమ.

2/ 8

సుమ భర్త రాజీవ్ కనకాల కూడా వెండితెరపై విలన్ రోల్స్ లోను, సపోర్టింగ్ రోల్స్ లోను చేస్తూ మెప్పిస్తున్నాడు. ముఖ్యంగా రాజమౌళి సినిమాలు చూస్తే రాజీవ్ కనకాల ఎంత అద్భుతమైన నటుడు అనేది మనకు అర్థం అవుతుంది.

3/ 8

అయితే ఇటీవల రాజీవ్ కి పేరు తెచ్చే పాత్ర ఒక్కటి కూడా రాలేదు. చాలా రోజుల గ్యాప్ తర్వాత లవ్ స్టోరీ సినిమాలో ప్రతినాయక పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. లవ్ స్టోరీ సినిమా సక్సెస్ అవ్వడంతో ఈ పాత్రకి మరింత గుర్తింపు వచ్చింది.

4/ 8

ఈ క్రమంలో రాజీవ్‌ కనకాలపై యాంకర్‌ సుమ కీలక వ్యాఖ్యలు చేసింది. తన భర్త నటనపై సోషల్ మీడియాలో ప్రశంశలు కురిపించింది. లవ్‌ స్టోరీ సినిమాలో రాజీవ్ క‌న‌కాల‌ ప్రేక్షకులు అసహ్యించుకునే పాత్రలో నటించాడు.

5/ 8

సాధారణంగా అలాంటి పాత్ర చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ రాజీవ్ కనకాల మాత్రం దర్శకుడు శేఖర్ కమ్ములను నమ్మి ముందడుగు వేశాడు. ఇక తమ నటనతో మనల్ని మెప్పించగల నటులు కొంత మందే ఉంటారు. అలాంటి వారిలో నా హబ్బీ రాజీవ్ కనకాల కూడా ఒకరు.

6/ 8

అద్బుతమైన రోల్ పోషించినందుకు కంగ్రాట్స్. ఆ పాత్ర చేసినందుకు నువ్వెంత చెడుగా ఫీల్ అయ్యావో నాకు తెలుసు.. కానీ ఆ పాత్రతో ఎంతో మంది మీద ప్రభావాన్ని చూపించావ్ అని అన్నారు. దీనిపై శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..

7/ 8

సొంత అన్న కూతురును చిన్నప్పుడు లైంగికంగా వేధించే బాబాయ్ పాత్ర ఇది. ఇలాంటి పాత్ర చేయడానికి రాజీవ్ కనకాల ఒప్పుకున్నాడు అంటే.. ముందు ఆయన భార్య సుమ కనకాలకు కూడా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని సక్సెస్ మీట్‌లో అన్నాడు.

8/ 8

ఇంత మంచి హిట్ అయిందంటే.. దానికి ప్రధాన కారణం రాజీవ్ కనకాల అంటూ దర్శకుడు శేఖర్ కమ్ముల ఒప్పుకున్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత సుమ ఎమోషనల్ అయింది. ఇక లవ్ స్టోరీ లాంటి సున్నితమైన ఎమోషనల్ రియలిస్టిక్ డ్రామా అందించిన శేఖర్ కమ్ములని కూడా ప్రశంసలతో ముంచెత్తింది సుమ. ప్రస్తుతం సుమ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Published by:Veera Babu
First published:October 03, 2021, 22:57 IST
తదుపరి గ్యాలరీ