భాష మార్చండి :

తెలుగు (Telugu)

Gold rate today: 18 రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు... నేటి రేట్లు ఇవీ

Gold and Silver rate 19-4-2021: ఏప్రిల్ 1 నుంచి ఇండియాలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. 18 రోజుల్లో బంగారం ధర రూ.3330 పెరగగా... వెండి ధర రూ.6400 పెరిగింది.

Gold and Silver rate 19-4-2021: దేశంలో సామాన్య ప్రజలు పెద్దగా బంగారం నగలు కొనకపోయినా... బంగారం దిగుమతులు మాత్రం పెరిగాయి. అంటే... అక్రమ మార్గాల్లో, నల్లధనంతో బంగారం కొంటున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ దిగుమతులు 22.58 శాతం పెరిగాయి. రూ.2.54 లక్షల కోట్లకు చేరాయి. నిజానికి కరోనా కాలంలో దేశ ప్రజల్లో చాలా మంది బంగారం నగలు కొనలేదు. పైగా అప్పుడు బంగారం ధరలు బాగా పెరిగాయి. అందువల్ల చాలా మంది బంగారంవైపు చూడలేదు. మరి దిగుమతులు ఎందుకు పెరిగాయి. డిమాండ్ ఎందుకు పెరిగింది అనేది తేలాల్సిన అంశం. చిత్రమేంటంటే వెండి దిగుమతులు మాత్రం 2021-21 ఆర్థిక సంవత్సరంలో 71 శాతం తగ్గిపోయి... రూ.5,896 కోట్లకి పడిపోయాయి. వజ్రాలు, ఆభరణాల ఎగుమతులు కూడా 27.5 శాతం తగ్గి... రూ.1,93,805 కోట్లకు పడిపోయాయి. మరి ఎగుమతులు తగ్గినా... దిగుమతులు ఎందుకు పెరిగాయో తేలాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)

Published by: Krishna Kumar N
First published: April 19, 2021, 6:25 AM IST