భాష మార్చండి :

తెలుగు (Telugu)

Tirupati by poll: తిరుపతి బై పోల్ లో ఉద్రిక్తత. రోడ్డుపై టీడీపీ నేతల బైఠాయింపు. ఓటు వేసిన అభ్యర్థులు

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే కొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో అధికారులు పూర్తి అలర్ట్ అయ్యారు. క్షేత్ర స్థాయి పోలింగ్ పై ఫోకస్ చేశారు. మరోవైపు పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే ప్రధాన అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తిరుపతి ఉప ఎన్నిక ఉదయం ఏడు గంటల నుంచి కొనసాగుతోంది. కరోనా విస్తరణ నేపథ్యంలో కోవిండ్ నిబంధనలు పాటిస్తూనే పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వికలాంగుల సైతం భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

Published by: Nagesh Paina
First published: April 17, 2021, 9:46 AM IST