పొట్టకూటి కోసం కోటి విద్యలు అనేది పెద్దలు చెబుతూ ఉంటారు. ఏ పని చేసినా తినడం కోసమే అనేది ఆ సామెత యొక్క అర్థం. అయితే కొంతమంది పుట్టిన దగ్గర నుంచే ధనవంతులుగా ఉంటారు. వాళ్ల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆర్థికంగా బలంగా ఉంటే వాళ్లు ఎలాంటి కష్టం పడాల్సిన అవసరం ఉండదు. కొంతమంది పుట్టుకతోనే పేదవాళ్లుగా ఉంటారు. వాళ్ల కుటుంబసభ్యులు ఆర్థికంగా వెనుకబడటంతో ఇలా పేదవాళ్లుగా ఉంటారు. ఇలా భూమిపై అందరి జీవితాలు ఒకేలా ఉండవు.
కష్టాలు, కన్నీళ్లు నిత్యం పలకరిస్తూనే ఉంటాయి. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో వారు ముందుకు సాగుతారు. కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తారు. ఓ బాలుడు సరిగ్గా ఇలానే చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం అతడు చేస్తున్న పని ప్రతీ ఒక్కరినీ ఆలోచింపచేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అహ్మదాబాద్ లోని మణినగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన ఓ 14 ఏళ్ల బాలుడు దహీ కచోరీ అమ్ముతున్నాడు. ఇలా అతడు ప్రతీ రోజు అదే ప్రదేశంలో విక్రయిస్తుండగా.. దోయాష్ పత్రబె అనే ఫుడ్ బ్లాగర్ ఆ బాలుడి వద్ద దహీ కచోరీ కొని తిన్నాడు. అలా అతడి వద్ద తినుకుంటూ.. ఆ బాలడి గురించి ఆరా తీశాడు. అక్కడే ఉండి అతడి పనితనాన్ని వీడియోలో బంధించాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నించగా.. ఆ బాలుడు ఇలా సమాధానం చెప్పాడు. తన కుటుంబాన్ని పోషించడం కోసం రోడ్డు పక్కన ఆహారం అమ్ముతున్నానని చెప్పాడు. అతడి తన పరిస్థితి చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు.
దీంతో దయాష్ చలించిపోయాడు. అతడికి దాతలు సహాయం చేయాలంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో చాలా మంది పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆ బాలుడికి సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. దయాష్ పెట్టిన ఈ పోస్టుకు చాలామంది సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఈ వీడియో పోస్టు చేసి చాలా రోజులు అవుతున్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags:Trending news, Viral Videos