Haribabu, News18, Rajanna Sircilla
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ (TSPSC Paper Leakag Issue) వ్యహారం తెలంగాణ (Telangana) రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ అంశంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 30 లక్షల మంది నిరుద్యోగ యువతతో చెలగాటం ఆడుతున్న బిఅర్ఎస్ (BRS) ప్రభుత్వంలోని మంత్రి కేటీఆర్ (MInister KTR) రాజీనామా చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. TSPSC పేపర్ లీకేజీకి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు వేములవాడ తెలంగాణ చౌక్ లో బీజేపీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లక్షలాది మంది నిరుద్యోగులు గత 8 సంవత్సరాలుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తే ఇప్పుడు నిర్వహించిన పరీక్ష పేపర్ లిక్ కావడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శమన్నారు.పేపర్ లీక్ కావడంతో 30 లక్షల మంది నిరుద్యోగ యువకులునిరాశతో ఉన్నారని, వారందరికీ ప్రభుత్వమే భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
పేపర్ రాసిన ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీకి మంత్రి కేటీఆర్ పూర్తి భాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దొర నియంతృత్వ పాలన సాగుతుందని ఆరోపించారు. నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ టిల్లు అని అన్నారు. మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ నోట్ అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. లిక్కర్ కేసులో కవిత అడ్డంగా దొరికిపోయిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అధికార బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేస్తుందని, వారికి ఎల్లవేళలా బిజెపి అండగా ఉంటుందని, నిరుద్యోగుల ఆత్మవిశ్వాసం పెంచే విధంగా బిజెపి పని చేస్తుందని అన్నారు.
Summer Heat: దంచికొడుతున్న ఎండలతో అలర్ట్.. వైద్యుల సూచనలు, సలహాలివే
డంగు సున్నంతో నిర్మించిన రాజన్న స్వాగత తోరణం.. 50 వసంతాలు పూర్తి!
Shock to Minister KTR: సొంత ఇలాకాలో కేటీఆర్ కు షాక్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
మంత్రికే చెల్లని చెక్కులు.. ఇవి చెల్లుతాయా అంటూ కేటీఆర్ అప్పుడే సరదా వ్యాఖ్య!
తనిఖీల్లో పలు ఇండ్లలో బయటపడిన వేట సామాగ్రి.. పోలీసులు ఏం చేశారో తెలుసా?!
గంజాయితో బజ్జీలు.. ఇంటి ఆవరణలోనే మొక్కల పెంపకంతో పోలీసులు షాక్!
Rajanna Siricilla: జాతీయ పరీక్షల్లో మెరిసిన తెలంగాణ ఏకలవ్య మోడల్ గురుకుల స్టూడెంట్స్!
బలోపేతమవుతున్న వైద్య ఆరోగ్య సేవలు.. ఆరోగ్య కేంద్రాలకు జాతీయ స్థాయి గుర్తింపు!
రాజన్న కోడెల పేడతో విద్యుత్ ఉత్పత్తి.. ఎలా ఉత్పత్తి చేయనున్నారంటే?!
యాభై వసంతాలు పూర్తయినా చెక్కు చెదరని రాజన్న స్వాగతం తోరణం.. కారణం ఏంటంటే..!
ఈ కోర్సులు చేస్తే ఉపాధి పక్కా.. అప్లై చేసుకోండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags:Local News, Siricilla, Telangana, Telangana bjp, TSPSC